Botsa Satyanarayana: సీఎం ఇంటిని ముట్టడిస్తానని చెప్పడం సరికాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేయాలంటూ విజయవాడలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తమ ప్రభుత్వం అవకాశం ఉన్నంతవరకు ప్రతి అంశాన్ని పరిష్కరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు. విద్యా శాఖలో సంస్కరణలు దశలు వారీగా వస్తాయన్నారు. 55 వేల ప్రభుత్వ స్కూళ్లను నాడు నేడు ద్వారా అభివృద్ది చేస్తున్నామన్నారు. ఉన్నత విద్యకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు.
యూటీఎఫ్ సభ్యులు సీఎం జగన్ ఇంటిని ముట్టడిస్తామనడం సరికాదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులు తొందరపడి సీఎంవో ముట్టడికి వెళ్లే ప్రయత్నాలు చేస్తుండటాన్ని ఆయన తప్పుపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కమిటీ వేశామని, ఆ కమిటీనే అన్ని అంశాలను పరిశీలిస్తుందన్నారు. ఇదే విషయంపై మళ్లీ ఓ సమావేశం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి బొత్స ఆరోపించారు. కాగా సీపీఎస్ రద్దు కోసం ఆందోళన చేపడుతున్న ఉపాధ్యాయులను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ పోలీసులు ఉపాధ్యాయులను, యూటీఎఫ్ నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!