NTV Telugu Site icon

Botsa Satyanarayana: స్కిల్ స్కాంలో అధికారుల పాత్ర ఉంటే చర్యలు తప్పవు.. స్పష్టం చేసిన మంత్రి

Botsa

Botsa

Botsa Satyanarayana: స్కిల్ స్కాంలో అధికారుల పాత్ర ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. మాకేం ప్రేమ్ చంద్రారెడ్డి మీద ప్రత్యేక ప్రేమ లేదన్నారు.. కానీ, అధికారులు అభ్యంతరం చెప్పాక.. ఫైల్ సీఎం దగ్గరకు వెళ్తుంది.. దానికి సీఎందే బాధ్యత అవుతుందన్నారు.. రిమాండ్ కొనసాగింపు సందర్భంగా తానేం తప్పు చేయలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవినీతి చేయకుండా పరిపాలన సాగించాలన్న ఆయన.. ఇన్నాళ్లూ తప్పులు చేసినా దొరకలేదు.. దొరికితే దొంగ.. దొరకకపోతే దొర అన్నట్టు చంద్రబాబు ఇన్నాళ్లూ వ్యవహరించారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చాక.. సీమెన్స్ కంపెనీ తన వాటా ఎందుకివ్వలేదు.? మధ్యలో డిజైన్ టెక్ ఎలా వచ్చింది..? అని ప్రశ్నించారు.

Read Also: VC. Sajjanar: గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్

చంద్రబాబు తెలిసే తప్పు చేశారు అని విమర్శించారు మంత్రి బొత్స.. సీమెన్స్ కంపెనీ మంచి కంపెనీనే.. కానీ, ఒప్పందం ప్రకారం జరగలేదన్నారు. సాఫ్ట్ వేర్ రూ. 2900 కోట్లా..? అని ఆవేదన వ్యక్తం చేశారు. సీమెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన సాఫ్ట్ వేర్.. ఎక్విప్మెంట్ రాలేదే..? అని ప్రశ్నించారు. మా ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్లకు ఎలాంటి అప్రిసియేషన్ లెటర్ ఇవ్వలేదు. అర్జా శ్రీకాంత్ గత ప్రభుత్వంలోనే స్కిల్ డెవలపెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా నియమితులయ్యారని తెలిపారు. చాలా స్కిల్ సెంటర్లల్లో సరైన టూల్స్ లేవు.. చంద్రబాబు ఇంత అవినీతి చేసి.. ఎందుకు జైలుకెళ్లారని అందరూ బాధ పడుతున్నారు.. చంద్రబాబు పరిస్థితిని చూసి జాలి పడుతున్నారంటూ మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. మరోవైపు.. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంలో కామెంట్‌ చేసిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అన్నారు బొత్స.. ఇలాంటి తప్పులు చేస్తే వదిలేయొచ్చా అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పోచారం అడగాలన్న ఆయన.. పోచారం లాంటి వ్యక్తులు రాజకీయం కోసం మాట్లాడొచ్చు.. కానీ, వ్యవస్థలను తాకట్టు పెట్టేలా వ్యవహరించకూడదని హితవుపలికారు బొత్స.