Botsa Satyanarayana : ఏలూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్, శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వం పై వరుస ఆరోపణలు చేశారు. కోవిడ్ తర్వాత పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచనతో మాజీ సీఎం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని, అందులో ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తై రెండేళ్లుగా అడ్మిషన్లు కూడా కొనసాగుతున్నాయని ఆయన గుర్తుచేశారు.
అయితే తాము నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడానికి పిపిపి మోడల్‌ను ప్రయోగించడం అత్యంత దుర్మార్గమని బొత్స తీవ్రంగా విమర్శించారు. దేశంలో ఎక్కడా విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటీకరణలో లేవని, ప్రజలకు ఈ సేవలను అందించడం ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పూర్తిచేసినట్లు తెలిపారు. గవర్నర్ అపాయింట్ మెంట్ లభించిన వెంటనే ఆ సంతకాలను సమర్పిస్తామని ప్రకటించారు.
తమపై ఉన్న కేసులను సుమోటోగా ఉపసంహరించుకున్న చరిత్ర దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేదని బొత్స అన్నారు. నిజాయితీ పరుడైతే న్యాయస్థానాల నుంచి నిర్దోషిగా నిరూపించుకోవాలని, కానీ చట్టాల్లో లొసుగులు చూసుకుని కేసులు తీసేయించుకోవడం సరైంది కాదని విమర్శించారు. దీనిపై గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేసులకు సంబంధించిన ఫైళ్లపై చంద్రబాబు సంతకాలున్నాయనీ, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులు ఉపసంహరించుకున్న ఏకైక సీఎం చంద్రబాబు అని ఆరోపించారు.
ఇటీవల తుఫానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ధాన్యం కొనుగోలు వేగంగా జరగడం లేదని బొత్స దుయ్యబట్టారు. తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా పంటలకు గిట్టుబాటు ధరలు ఉండవని, రైతుల వద్ద కొనుగోలు శక్తి తగ్గిపోయి జీఎస్టీ వసూళ్లు కూడా పడిపోయాయని అన్నారు.
HMD XploraOne: పిల్లల కోసం మొదటి స్మార్ట్‌ఫోన్.. HMD XploraOne వచ్చేస్తోంది..
ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదని, పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం, ఎరువులు సమకూర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. ఈ సీజన్‌లో కూడా ఎరువుల కొరత తప్పదనే పరిస్థితి కనిపిస్తోందని హెచ్చరించారు.
గత 18 నెలల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, గత అయిదేళ్లలో జరిగిన నేరాల కంటే ఎక్కువ నేరాలు ఈ కాలంలోనే నమోదయ్యాయని బొత్స ఆరోపించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో అట్టడుగున ఉందని, అప్పుల్లో అగ్రస్థానంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీల రాజీనామాల విషయంలో ఒత్తిళ్లు, ప్రలోభాలే కారణమని, మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం సరైందని అన్నారు.
2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుచుకున్న స్థానాలేంటని ప్రశ్నించిన ఆయన, “పవన్ 15 ఏళ్లు కలిసి ఉండాలని కోరుకుంటే సరిపోదు, ప్రజలు కోరుకోవాలి” అన్నారు. ఈ ప్రభుత్వానికి 15 ఏళ్లు కాదు, 15 నెలలు కూడా అధికారంలో కొనసాగేందుకు హక్కు లేదని మండిపడ్డారు. వ్యవసాయం “దండగ” అని నమ్మే చంద్రబాబు నుంచి రైతులకు మేలు జరగదని బొత్స వ్యాఖ్యానించారు. సూట్‌బూట్ వేసుకున్న ధనవంతులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఆరోపించారు. వైఎస్సార్, వైఎస్ జగన్ రైతులకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు.
Akhanda 2 : అఖండ 2 టిక్కెట్ల ధరల పెంపునకు ఏపీ సర్కార్ ఓకే.. ఎంత పెంచారంటే !
