బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. నా నియోజకవర్గాన్ని విడిచిపెట్టినందుకు చాలా చింతిస్తున్నాను అని పదవికి రాజీనామా చేసిన అనంతరం జాన్సన్ మాట్లాడారు. మేయర్‌గా, పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడి ప్రజలకు సేవ చేశాను.. ఇది నాకు చాలా గౌరవప్రదమైనది అని ఆయన పేర్కొన్నారు. పార్టీగేట్ కుంభకోణం దర్యాప్తు నివేదిక తర్వాత.. అతను UK ఎంపీ పదవికి రాజీనామా చేసిశాడు. కరోనా సమయంలో అతను లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడు. జాన్సన్ యూకే పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు చేశారని కూడా ఆరోపించారు.
Read Also : Weather Report: తీవ్రమైన చలి, మండుతున్న వేడి, అకాల వర్షం.. 4 నెలల్లో 233 మరణాలు
బోరిస్ జాన్సన్ 2022లో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ, ఆయన ఎంపీ పదవిలో కొనసాగుతున్నారు. అయితే పార్టీగేట్ కేసులో ప్రివిలేజెస్ కమిటీ విచారణ నివేదిక రావడంతో ఆయన ఎంపీ పదవికి రిజైన్ చేశారు. పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించినందుకు తనపై చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నాననీ, అందులో స్పష్టంగా పేర్కొన్న ప్రివిలేజెస్ కమిటీ నుంచి తనకు లేఖ అందిందని జాన్సన్ చెప్పుకొచ్చారు. అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానన్నారు.. హౌస్ ఆఫ్ కామన్స్ గౌరవాన్ని జాన్సన్ కించపరిచారని ప్రివిలేజెస్ కమిటీ పేర్కొనింది.
Read Also : WTC Final 2023: మూడోరోజు 300 ఆధిక్యానికి చేరువలో ఆసీస్..
కమిటీ అన్ని వేళలా సభ విధి విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపింది. విచారణ నివేదికను త్వరలో విడుదల చేస్తామని.. అంతకంటే ముందు సోమవారం సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రివిలేజెస్ కమిటీకి లేబర్ ఎంపీ హ్యారియెట్ హర్మాన్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో సతమతమవుతున్న తరుణంలో బ్రిటన్ కూడా దాని పట్టులో పడింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అయితే అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ స్వయంగా నిబంధనలను ఉల్లంఘించారు. అతను 10 డౌనింగ్ స్ట్రీట్ లో మద్యం పార్టీ చేసుకున్నాడు.