తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటే కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు అని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇక్కడ ప్రజలు మునిగిపోతుంటే, కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో మునిగి పోయారు.. ముఖ్యమంత్రి నిద్ర లేస్తేనే యంత్రాంగం లేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే తెలంగాణ ప్రజల గురుంచి పటించుకోవాలి.. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఉత్తర తెలంగాణ మునిగి పోతే పట్టించుకోవా అని ప్రశ్నించారు. చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.
Read Also: Muharram: మొహర్రం ఊరేగింపులో అపశ్రుతి.. విద్యుదాఘాతానికి నలుగురు బలి
కాళేశ్వరం ఖర్చు ఎంత, లాభం ఎంత, సమ్మక్క బ్యారేజ్ వల్ల లాభం ఎంత, ఖర్చు ఎంత అనే దానిపై శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. ఇపుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే బీజేపీకి 10 కంటే ఎక్కువ సీట్లే వస్తాయని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. జీహెచ్ఎంతో పాటు పలు జిల్లాల్లో ఇప్పటికే బీజేపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. కాంగ్రెస్ ఎంత కష్టబడ్డ జల్లెడలో నీరు పోసినట్టే.. నెలలో కాంగ్రెస్ ను కేసీఆర్ ఖాళీ చేస్తాడు అని బీజేపీ నేత ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు కోరుతున్న బీజేపీలో చేరండి.. ప్రగతి భవన్ లో మొదటి రోజు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.. నెక్స్ట్ డే నుంచి నో ఎంట్రీ అనే బోర్డు కనిపిస్తుందన్నాడు.
Read Also: Sai Rajesh : చిరంజీవి గారి మాటలకు కన్నీళ్లు వచ్చేసాయి..
వేల కోట్లు ఉన్న వాళ్ళు కేసీఆర్ ముస్టి కోసం ఎందుకు పోతున్నారో అర్థం కావడం లేదు అని బూర అన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఎంత బడ్జెట్ రావాల్సి ఉండే.. ఎంత ఖర్చు చేశారో కేసీఆర్ ప్రభుత్వం చెప్పాలి అని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. దళిత బంధు ఎర వేసి ఎంత దారి మళ్లించారో చెప్పాలి.. కలుషిత నీరు వల్ల జాండిస్, ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.