NTV Telugu Site icon

Boora Narsaiah Goud : తెలంగాణ ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు

Boora Narsaiah Goud

Boora Narsaiah Goud

యాదాద్రి భువనగిరి జిల్లా జైలులో ఉన్న ట్రిపుల్ ఆర్ రోడ్డు బాధిత రైతులను పరామర్శించేందుకు మాజీ ఎంపీ, బీజేపీ నేత బుర నర్సయ్య గౌడ్ జైలు వచ్చారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నియంతృత్వ పాలన, పోలీస్ రాజ్యం, బీఆర్ఎస్ మంత్రుల అరాచకాలు చూస్తుంటే తెలంగాణ ప్రజల ఆశలు ఆడియశలు అయ్యాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Eye Drop Infections: మరో ఫార్మాస్యూటికల్ కంపెనీపై ఆరోపణలు.. శ్రీలంకలో ఐ డ్రాప్స్ తో 30 మందికి ఇన్ఫెక్షన్

యావత్తు తెలంగాణ ప్రజలు ఎవరు సంతోషంగా లేరు సంబరాలు చేసుకోవడం లేదని ఆయన అన్నారు. సీఎంఓ అధికారులు కూడా సంబరాలకు దూరంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులకు అండగా పోరాటం చేస్తున్న బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి పైన అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ పాత అలైన్మెంట్ మార్చడంలో గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. జైలులో ఉన్న ట్రిపుల్ ఆర్ రైతులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గూడూరు నారాయణ రెడ్డి మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన అన్నారు.

Also Read : Manipur Violence: మణిపూర్లో సద్దుమణిగిన హింస.. ఇప్పటికి 98మంది మృతి

Show comments