Site icon NTV Telugu

High Court: “I Love You చెప్పడంలో లైంగిక ఉద్దేశం లేదు”.. హైకోర్టు సంచలన తీర్పు..

Bombay High Court

Bombay High Court

మైనర్ బాలికను “ఐ లవ్ యు” అని ఆటపట్టించాడనే ఆరోపణలపై 2015లో దోషిగా తేలిన 25 ఏళ్ల వ్యక్తిని బాంబే హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దిగువ కోర్టు తీర్పును కొట్టివేసింది. గతంలో నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు.. ఆ వ్యక్తికి భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 354-A (లైంగిక వేధింపులు), 354D (వెంబడించడం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (POSCO) చట్టంలోని సెక్షన్ 8 కింద మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును బాంబే హై కోర్టు కొట్టేసింది. ఈ తీర్పుతో పోక్సో కేసులో దాదాపు పదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి ఉపశమనం లభించింది. ఈ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం మాటలతో ప్రేమను వ్యక్తపరచడం లైంగిక వేధింపులుగా పరిగణించబడదని పేర్కొంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

READ MORE: Spitting Cobra : కంటెంట్ కోసం కన్ను తాకట్టు.. అందుకే కోబ్రా గేమ్స్‌ ఆడొద్దు..

అసలు ఏం జరిగిందంటే.. ఓ మైనర్ బాలిక తనకు “I Love You” చెప్పాడని 25 ఏళ్ల వ్యక్తిపై కేసు పెట్టింది. ఆ వ్యక్తి తనను ఆట పట్టించాడని.. ఐల వ్యూ చెప్పాడని పేర్కొంటూ.. 2015లో కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆ వ్యక్తిపై పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన జిల్లా సెషన్స్ కోర్టు అతడిని నేరస్థుడిగా పరిగణించింది. మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని అప్పీల్‌లో పేర్కొన్నారు. ఈ కేసుపై బుధవారం విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు నాగ్​పుర్​ బెంచ్‌కు చెందిన జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కే ఈ కేసును కొట్టేసింది. ఆ వ్యక్తిని నిర్దోశిగా ప్రకటిస్తూ తుది తీర్పు వెలువరించింది. ‘ఐ లవ్​ యూ’ చెప్పడంలో లైంగిక ఉద్దేశం ఉన్నట్లు నిరూపణ కాలేదని స్పష్టం చేసింది. ఆ బాలికను ముట్టుకోవడం, అసభ్యకరమైన సైగలు చేయడం చేసి ఆమెను అవమానించట్లు నిరూపణ జరగలేదని పేర్కొంది.

READ MORE: Police High Alert: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల అరెస్ట్‌.. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం..

Exit mobile version