Shahid Kapoor React on His Love Breakups: షాహిద్ కపూర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2003లో ‘ఇష్క్ విష్క్’ చిత్రం ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. 2006లో వచ్చిన ‘వివాహ్’ ద్వారా మంచి హిట్ ఖాతాలో వేసుకున్న షాహిద్.. ఆ తరువాత ఏడాది వచ్చిన ‘జబ్ వుయ్ మెట్’తో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. లవర్ బాయ్‌గా ప్రత్యేక గుర్తింపు పొందాడు. కమీనీ, హైదర్, ఉడ్తా పంజాబ్, పద్మావత్, కబీర్ సింగ్,…
దివంగత క్రికెటర్ బిషన్ సింగ్ బేడి కోడలు, బాలీవుడ్ నటి నేహా ధుపియా ధోనీ కొట్టిన షాట్లకు ఫిదా అయింది. సంతోషంతో పెద్దగా అరుస్తూ వైల్డ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నేహా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటి నేహా ధూపియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నేహా భర్త, నటుడు అంగద్ బేడీ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేహాకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 41 ఏళ్ల ఈ ముదురు బ్యూటీ 2018 లో తనకంటే చిన్నవాడైన నటుడు అంగద్ బేడీని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2018 లో ఈ దంపతులకి ఒక పాప పుట్టగా,…
సినీ ప్రపంచంలో అందరి అంతిమ లక్ష్యం డైరెక్టర్ అనిపించుకోవటమే! కానీ, చాలా మంది టాప్ స్టార్స్, కెమెరామెన్, రైటర్స్, ఈవెన్ చేతిలో బోలెడు డబ్బులున్న ప్రొడ్యూసర్స్ కూడా ఆ రిస్క్ చేయరు! ఎందుకంటే, దర్శకత్వం ఆషామాషీ కాదు. మొత్తం సినిమా భారమంతా డైరెక్టర్ మీదే ఉంటుంది. పడవ తేలినా, మునిగినా తనదే బాధ్యత… 30 ఏళ్లుగా బాలీవుడ్ లో ఫ్యాషన్ కు మారుపేరుగా మారిన మనీశ్ మల్హోత్రా ఇప్పుడు డైరెక్షన్ రిస్క్ చేయబోతున్నాడు. ఆయన డిజైన్ చేసిన…
నలభై యేళ్ళ బాలీవుడ్ నటి నేహా ధూపియా తెలుగులోనూ ‘నిన్నే ఇష్టపడ్డాను, విలన్, పరమ వీరచక్ర’ వంటి చిత్రాలలో నటించింది. మూడేళ్ళ క్రితం మే 10న నటుడు అంగద్ ను వివాహం చేసుకుంది. విషయం ఏమిటంటే… కరోనా కారణంగా ఈ ప్రేమజంట ఇప్పుడు వేరువేరు నగరాల్లో ఐసొలేషన్ లో ఉండిపోయారు. తమ మూడో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్త అంగద్ కు సోషల్ మీడియా ద్వారానే నేహా ధూపియా ప్రణయసందేశం పంపింది. ‘నువ్వు నేను వేరు వేరు…