Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bollywood Has Changed Its Route Focusing On War Films What Is The Reason

Bollywood : రూట్ మార్చిన బాలీవుడ్.. వార్ సినిమాలపైనే ఫోకస్.. కారణం ఏంటి?

Published Date :November 9, 2025 , 1:06 pm
By subbarao kilari
Bollywood : రూట్ మార్చిన బాలీవుడ్.. వార్ సినిమాలపైనే ఫోకస్.. కారణం ఏంటి?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

బాలీవుడ్ అంతే ఎప్పుడు ఏ జోనర్‌లోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతుందో బీటౌన్‌కే తెలియదు. లాస్ట్ ఇయర్ అంతా హారర్ చిత్రాలతో హడావుడి చేసింది. కాంట్రవర్సీయల్ సబ్జెక్టులకైతే ఇక నో ఎండ్ కార్డ్. రీసెంట్ టైమ్స్‌లో లవ్ స్టోరీలు సక్సెస్ కావడంతో వాటిపై ఇంట్రస్ట్ చూపుతోంది. కానీ సడెన్లీ వార్ బ్యాక్ డ్రాప్ చిత్రాలపై ఇష్టం పెంచుకుంటోంది బీటౌన్. సల్మాన్ నుండి అగస్త్యా నంద వరకు వార్ జోన్ చిత్రాలతోనే రాబోతున్నారు అవేంటంటే..

Also Read : OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన దీపావళి సినిమాలు.. ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవబోతున్నాయంటే

Also Read

  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
  • What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
Add as a preferred
source on google

సికిందర్ ప్లాప్ తర్వాత సల్మాన్ ఖాన్ సెలక్టివ్‌గా తీసుకున్న ప్రాజెక్ట్ బాటిల్ ఆఫ్ గాల్వన్. గాల్వన్ లోయలో చైనా సైనికునితో వీరోచిత పోరాటం చేసి మరణించిన తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు అపూర్వ లఖియా. చిత్రాంగద సింగ్ హీరోయిన్‌. నెక్ట్స్ ఇయర్ జూన్ లో మూవీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 1962 ఇండో- చైనా యుద్దం ఆధారంగా తెరకెక్కుతోన్న బాలీవుడ్ ఫిల్మ్ 120 బహుదూర్. ఈ రెజంగ్‌లా వార్‌లో 120 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ సైన్యం.. 3 వేల మంది చైనా ఆర్మీతో వీరోచిత పోరాటం చేసి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే కథను తెరపైకి తెస్తోంది బాలీవుడ్. భారత్ తరుఫున నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఫర్హాన్ అక్తర్. నవంబర్ 21న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది 120 బహుదూర్. 1962లో ఇదే రోజున ఈ యుద్దం ముగిసింది.

Also Read : Bollywood : హిట్ కొట్టి రెండేళ్లు.. ఇలా అయితే ఎలా పాప

అమితాబ్ మనవడు అగస్త్యా నంద సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఎంట్రీలో లవ్ స్టోరీతో కాకుండా వార్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇక్కీస్‌తో వస్తున్నాడు. 1971 ఇండో పాక్ యుద్దం బాటిల్ ఆఫ్ బసంత్ పూర్‌లో వీరోచిత పోరాటం చేసి 21 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆపీసర్ అరుణ్ కేతర్ పాల్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1971 ఇండో- పాక్ వార్ ఆధారంగా తెరకెక్కిన ఫిల్మ్ బోర్డర్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాబీడియోల్‌తో పాటు వరుణ్ ధావన్, అహన్ శెట్టి కీ రోల్ ప్లే చేస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ జనవరి 23న రిలీజ్ ప్లాన్ చేస్తోంది టీ సిరీస్. అలాగే అమీర్ ఖాన్ లాహోర్ 1947 కూడా ఇదే బ్యాటిల్ ఫీల్డ్ బ్యాక్ డ్రాప్ చిత్రంగా తీసుకురాబోతున్నారు. వార్ జోన్ స్టోరీలంటే రియల్ స్టోరీలే కాదు ఫిక్షనల్ స్టోరీలు కూడా ఉన్నాయి. అలా ఫ్యూర్ ఫిక్షనల్ స్టోరీనే సిద్దం చేయబోతున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. వార్ డ్రామాతో పాటు లవ్ స్టోరీకి వెయిటేజ్ కల్పించబోతున్నాడట. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ ఆర్మీ అధికారులుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఆలియా ఫీమేల్ లీడ్. ఇలా వరుసగా సీనియర్స్ టూ జూనియర్స్ వార్ డ్రామాలకు సై అంటున్నారు. మరీ ఈ జాబితాలో ఇంకెంత మంది చేరతారో.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 120 Bahadur
  • Battle Of Galwan
  • Bollywood
  • Bollywood war films
  • BORDER 2

తాజావార్తలు

  • Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో

  • Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!

  • Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!

  • Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత

  • BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్‌లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్‌క్వాలిఫికేషన్!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions