Site icon NTV Telugu

MS Dhoni: ధోనీ షాట్లకు బాలీవుడ్ నటి ఫిదా.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

Neha

Neha

ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యా్చ్లో సీఎస్కే ఉత్కంఠ విజయం సాధించింది. ముంబైలో మ్యాచ్ జరిగినప్పటికీ, ముంబై అభిమానులతో పాటు చెన్నై అభిమానులు కూడా లైవ్లో మ్యాచ్ తిలకించారు. అక్కడ కూడా.. చెన్నై చెన్నై అంటూ, ధోని ధోని అంటూ సీఎస్కే అభిమానుల అరుపులే ఎక్కువగా వినపడ్డాయి. అయితే.. ముంబైలో చెన్నై ఫ్యాన్స్ అధికంగా రావడానికి కారణం ‘తలా’. అదేనండీ మహేంద్ర సింగ్ ధోని. అతని ఆటను చూసేందుకు సీఎస్కే అభిమానులు భారీగా వచ్చారు. మొన్న హైదరాబాద్లో కూడా సీఎస్కే అభిమానులు ధోనీని చూసేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. అందుకు కారణమేంటంటే ఈ సీజన్కు ధోని చివరిదని అందరూ భావిస్తున్న క్రమంలో ధోనీ ఆటను చూసేందుకు ఫ్యాన్స్ తరలివస్తున్నారు.

Gidugu RudraRaju: రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి..!

ఇదిలా ఉంటే.. ఈ సీజన్ లో చెన్నై ఆడిన 6 మ్యాచ్ ల్లో ధోనీ బ్యాటింగ్ దిగింది కేవలం 3 మ్యాచ్ల్లోనే. మొదటి మ్యాచ్లో, నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్లో ఫ్యాన్స్ కు ఉత్సాహం నింపాడు. మరీ ముఖ్యంగా.. ఆడిన 4 బంతుల్లోనే 20 పరుగులతో చెలరేగాడు. వరుసగా 3 బంతుల్లో హ్యాట్రిక్ సిక్సులు కొట్టి ఫ్యాన్స్ కు కనువిందు చేశాడు. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. కూర్చున్న సీట్లలో నుంచి ధోనీ..ధోనీ అంటూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. సామన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ధోనీ ఇన్నింగ్స్ ను ఎంజాయ్ చేశారు.

Cricket Betting: హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. రూ.2.5 కోట్లు సీజ్‌

దివంగత క్రికెటర్ బిషన్ సింగ్ బేడి కోడలు, బాలీవుడ్ నటి నేహా ధుపియా ధోనీ కొట్టిన షాట్లకు ఫిదా అయింది. సంతోషంతో పెద్దగా అరుస్తూ వైల్డ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నేహా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్ కు నేహా ధుపియా తన భర్త అంగద్ బేడి, ఫ్రెండ్స్ కరీనా కపూర్, జాన్ అబ్రహంతో కలిసి తిలకించింది. కాగా.. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version