బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సమన్లు జారీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్… మనీలాండరీంగ్ కేసులో ఇవాళ ఢిల్లీలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 200 కోట్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసును విచారిస్తున్న ఈడీ… ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్, అతని భార్య, నటి లీనా మరియా పాల్‌తో పాటు మరో ఆరుగురి పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. సుకేశ్ చంద్రశేఖర్… జాక్వెలిన్‌కు విలువైన బహుమతులు ఇచ్చినట్టు గుర్తించి… ఆమెను ఇప్పటికే పలుమార్లు విచారించారు ఈడీ అధికారులు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుండటంతో జాక్వెలిన్‌పై లుక్‌అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అందుకే… గత ఆదివారం ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు జాక్వెలిన్ ప్రయత్నించినా… ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు… కొన్నాళ్ల కిందట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల చంద్రశేఖర్‌పై 15 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. విలాసవంతమైన జీవనశైలి కోసం బెంగళూరు, చెన్నైలో అనేక మందిని కోట్లలో మోసం చేశాడు. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు. ఆగస్టు 23న సుకేశ్‌పై మనీలాండరింగ్ కేసు నమోదైంది. చెన్నైలో సముద్రానికి ఎదురుగా ఉన్న విలాసవంతమైన బంగ్లాతో పాటు, 82 లక్షల 50 వేల నగదు, డజనుకు పైగా లగ్జరీ కార్లను ఈడీ సీజ్ చేసింది. అక్టోబర్‌లో సుకేశ్‌పై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ సమన్లు జారీచేసిన తర్వాత జాక్వెలిన్ వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పటికే పలుసార్లు ఆమెను ప్రశ్నించిన ఈడీ అధికారులు… ఇవాళ మరోసారి విచారణ చేయబోతున్నారు.