బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిపాలయ్యారు. ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. 89 ఏళ్ల ఆయన ఆసుపత్రిలో చేరిన వార్త ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, వయసు రీత్యా జరిగే సాధారణ ఆరోగ్య పరీక్ష కోసం ఆసుపత్రికి వచ్చినట్లు సన్నిహిత కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ధర్మేంద్ర పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని రెగ్యులర్ చెకప్ ల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు ధర్మేంద్ర బృందం తెలిపింది. Also…