Bobbillanka Murder: బొబ్బిల్లంకలో జంట హత్యలు.. భార్య, అత్తను నరికి చంపిన వ్యక్తి

  • తూర్పు గోదావరి జిల్లా బొబ్బిల్లంకలో జంట హత్యలు
  • భార్య, అత్తను నరికి చంపిన వ్యక్తి
  • కుటుంబ గొడవలే హత్యకు కారణం
Murder

Murder

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ విభేదాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన మొదటి భార్యతో పాటు అత్తను కత్తితో నరికి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జననివాస ప్రాంతాల్లో ఈ ఘటన జరగడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికుల వివరాల మేరకు డబుల్ మర్డర్ వివరాలు ఇలా ఉన్నాయి..

చోడదాసి సీతారామరాజు తన మొదటి భార్య లత (30), అత్త గుమ్మడి లక్ష్మి (50)పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నేరానికి ఉపయోగించిన కత్తిని గోదావరిలో పడేసి సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న సీతారామరాజు, లతలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా విడిగా ఉంటున్నప్పటికీ.. ఒకే వీధిలో నివసిస్తున్నారు. నిందితుడు సీతారామరాజు ప్రస్తుతం మరో మహిళను వివాహం చేసుకున్నాడు.

Also Read: IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

మొదటి భార్యపై అనుమానంతో సీతారామరాజు సోమవారం అర్ధరాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు. భార్య, అత్తను కత్తితో నరికి అతి కిరాతకంగా నరికి హత్య చేశాడు. ఆపై నిందితుడు సీతారామరాజు పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు సీతానగరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.