Srinagar: జీలం నదిలో పడవ బోల్తా.. ఏడుగురు సేఫ్, ఇద్దరు మిస్సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ కాశ్మీర్‌లోని హతివారా పుల్వామాలోని జీలం నదిలో బుధవారం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది నీటిలో పడిపోయారు. కాగా.. అందులో ఏడుగురిని రక్షించారు, మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. SDRF రెస్క్యూ సిబ్బంది వారి సామగ్రితో తప్పిపోయిన వ్యక్తుల కోసం రంగంలోకి దిగారు. నదిలో ఇసుక తీసేందుకు వెళ్లి బోటు ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. పడవలో తొమ్మిది మంది కార్మికులు ఉండగా, వారంతా జమ్మూ కాశ్మీర్ వెలుపలి ప్రాంతాలకు చెందిన వారని పేర్కొన్నారు. బోటు బోల్తా పడడంతో ఒడ్డున ఉన్నవారు వెంటనే సాయం కోసం కేకలు వేయడంతో వారిని రక్షించేందుకు కొంత మంది నదిలోకి దూకారు.
Parshottam Rupala: క్షత్రియ వర్గాన్ని క్షమాపణ కోరిన కేంద్రమంత్రి
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
నదిలో మునిగిపోయిన కూలీలను కాపాడే ప్రయత్నం చేశారు. కాగా, సమాచారం అందిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. కాగా.. ఏడుగురు కార్మికులను రక్షించారు.. మరో ఇద్దరు తప్పిపోయారు. ఈరోజు సాయంత్రం 7.15 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న సీనియర్ SDRF అధికారి తెలిపారు. ఏడుగురు కార్మికులను రక్షించి ప్రథమ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారని.. వారి కోసం అన్వేషణ కొనసాగుతోందన్నారు. చీకటి ఉన్నప్పటికీ, రెస్క్యూ వర్కర్లు నదిలో తప్పిపోయిన వ్యక్తుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!