Blue Whale: సముద్ర జీవులు మృత్యువాతపడి తీరానికి కొట్టుకొచ్చే సందర్భాలు చాలానే ఉంటాయి.. సముద్రంలో జీవించే వివిధ రకాల ప్రాణాలు.. ప్రాణాలు వీడిచి ఒడ్డుకు కొట్టుకొచ్చిన సందర్భాలు అనేకం.. అయితే, కొన్నిసార్లు అరుదైన చేపలు, తిమింగలాలు కూడా తీరానికి కొట్టుకుస్తుంటాయి.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం (బ్లూ వేల్) కొట్టుకొచ్చింది.. సుమారు 25 అడుగులు పొడువైన బ్లూ వేల్.. దాదాపు 5 టన్నుల వరకు బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ఇవి బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని.. సముద్రంలో మరీ లోతుకు వెళ్లి మృత్యువాత పడడంతో.. ఆ తర్వాత తీరానికి కొట్టుకొచ్చి ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.
Read Also: Amit Shah On Manipur Video: కావాలనే మణిపూర్ మహిళల వీడియో లీక్ చేశారు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
అంతేకాకుండా.. నీలిరంగుతో ఆహ్లాదకరంగా కనిపించే బ్లూ వేల్.. సముద్రం అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా అల్లకల్లోలంగా మారడంతో.. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో కూడా చనిపోయి ఉండవచ్చు అంటున్నారు. ఇక, సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన ఈ అరుదైన బ్లూ వేల్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.. అంతే కాదు.. ఎక్కడికి వెళ్లినా ఫొటోలు, సెల్ఫీలు దిగడం కామన్‌గా మారిపోయిన విషయం తెలిసిందే కాగా.. తీరానికి కొట్టుకొచ్చిన బ్లూ వేల్ దగ్గర కూడా సెల్ఫీలు దిగుతున్నారు ప్రజలు.