Demon: భయపెట్టడానికి ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమన్”..!

Demon

Demon

Demon: సినీ ప్రేక్షకులను భయబ్రాంతులకు బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమన్” ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. రమేశ్ పళనీవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లింగ్ కథా చిత్రం గురువారం (మే 29) నుండి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం భవాని మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సచిన్ మణి, అబర్నతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించి తమ నటనతో అలరించారు. భయానకత, ఉత్కంఠ, మిస్టరీ, అనూహ్య మలుపులతో కూడిన కథనం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Read Also: Gaddar Awards: 14 ఏళ్ల తర్వాత సినిమా అవార్డుల సంబరం.. గద్దర్ పేరుతో సినీ పురస్కారాలు..!

×
×
Ad

కథా నిర్మాణాన్ని మరింత బలపరుస్తూ రోనీ రాఫెల్ అందించిన నేపథ్య సంగీతం, ఆర్.ఎస్. ఆనందకుమార్ తీసిన విజువల్స్, రవికుమార్ ఎం. చేసిన కట్టింగ్ ఎడిటింగ్ సినిమాకు అత్యున్నత స్థాయి టెక్నికల్ హంగులను జతచేశాయి. వీకెండ్‌ను ఉత్కంఠభరితంగా గడపాలనుకుంటున్నవారికి “డీమన్” చిత్రం ఓ మంచి ఎంపిక. హారర్ థ్రిల్లర్ జానర్‌ ఇష్టపడే వారికి ఈ చిత్రం నేటి నుండి ఆహా ఓటీటీలో వీక్షించవచ్చు.

Read Also: Seetha Payanam: తండ్రి డైరక్షన్‌లో హీరయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కూతురు.. టీజర్ రిలీజ్..!