Seetha Payanam: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీతా పయనం’. ఈ చిత్రంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా నటిస్తున్నది. అర్జున్ కుమార్తెకు ఇది హీరోయిన్‌గా తొలి సినిమా. మరోవైపు హీరోగా నిరంజన్ సుధీంద్ర నటిస్తున్నాడు. ఆయన ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర సోదరుడి కుమారుడు. ఈ సినిమాను శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అర్జున్ సర్జా స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇది ఓ ఎమోషనల్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంటోంది.
టీజర్ ప్రకారం.. హీరోయిన్ చేసే కార్ జర్నీలో హీరో పరిచయం కావడం, ఆ పరిచయం ప్రేమగా మారడం, ఆ ప్రేమలో వారు ఎదుర్కొనే సంఘర్షణలు కథలో ప్రధానాంశంగా ఉండనున్నాయని అర్థమవుతోంది. ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. సత్యరాజ్, ప్రకాశ్ రాజ్, కోవై సరళ, బిత్తిరి సత్తి, సిరి హనుమంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే అర్జున్ సర్జా, ధృవ్ సర్జాలు గెస్ట్ రోల్స్‌లో మెరవనున్నారు. టీజర్‌లో సత్యరాజ్ చెప్పే ప్రేమపై డైలాగ్, ధృవ్ సర్జా ఎంట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Read Also: Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సలహాదారుడిగా వైదొలిగగిన ఎలన్ మస్క్..!
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న అనూప్ రూబెన్స్ టీజర్‌లోనే తన మ్యూజిక్ తో మెప్పించాడు. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్, హీరో ఉపేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఒక తండ్రి తన కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించడం, అలాగే కుటుంబ కథా ప్రేమకథతో ముడిపెట్టి ప్రేక్షకుల మనసులను గెలవడం అనే లక్ష్యంతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల తేదీ ప్రకటించనుంది. ఇకెందు ఆలస్యం ‘సీతా పయనం’ టీజర్‌ను మీరు చూసేయండి.