కాంగ్రెస్ పార్టీకి బెంగళూరు కోర్టు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సినిమాలోని పాటలను ప్లే చేసినందుకు గాను ఒక సంగీత సంస్థ కాంగ్రెస్‌పై కాపీరైట్ కేసు దాఖలు చేయడంతో బెంగళూరు కోర్టు కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశించింది.