తెలుగులో దసరా మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాలో హీరోగా నటించారు.. అతని లైఫ్ లో హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోగా దీక్షిత్ శెట్టి కనిపించాడు.. ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు కానీ కన్నడలో ఇండస్ట్రీలో బ్లింక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేస్తుందని సమాచారం..
ఇండియన్ ఫస్ట్ మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్‌గా మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను అందుకున్నది.థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.. అమెజాన్ ప్రైమ్‌లో బ్లింక్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం కన్నడ వెర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలోనే తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం..
శ్రీనిధి బెంగళూరు దర్శకత్వం వహించగా, దీక్షిత్ శెట్టికి జోడీగా మందాత హీరోయిన్‌గా నటించింది. చైత్ర జే ఆచార్ కీలక పాత్ర పోషించింది. మార్చి 8న ఈ కన్నడ మూవీ థియేటర్లలో రిలీజైంది.. మొదటి షోతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత రోజురోజుకు క్రేజ్ ను అందుకుంది.. సరికొత్త కథగా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటిలో కూడా దూసుకుపోతుంది.. త్వరలోనే తెలుగులో కూడా రాబోతుంది..