Blast near Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blast near Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు సంభవించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో ‘పేలుడు’ సంభవించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు కాల్ వచ్చింది. మంగళవారం సాయంత్రం కాన్సులేట్ భవనం సమీపంలో పేలుడు జరిగినట్లు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ధృవీకరించింది. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఇజ్రాయెల్ జెండాతో చుట్టబడిన లేఖ కూడా లభ్యమైందని తెలిసింది. ఈ లేఖ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన రాయబారిని ఉద్దేశించి పంపినట్లు ఆ వర్గాలు తెలిపాయి. “సాయంత్రం 5:08 (సాయంత్రం) సమయంలో రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించిందని మేము నిర్ధారించగలము. ఢిల్లీ పోలీసులు, భద్రతా బృందం పరిస్థితిని ఇంకా దర్యాప్తు చేస్తున్నారు” అని రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
Read Also: Russia-Ukraine War: మరోసారి రష్యాపై దాడి చేసిన ఉక్రెయిన్.. ఒకరు మృతి
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
దేశ రాజధానిలోని దౌత్యపరమైన ప్రాంతం అయిన చాణక్యపురి ప్రాంతంలో ఉన్న రాయబార కార్యాలయం వెనుక జరిగిన పేలుడుపై ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు గుర్తు తెలియని కాల్ చేసి పేలుడు సంభవించిందని తెలిపాడు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో పేలుడు సంభవించిందని కాలర్ పేర్కొన్నాడు. అనంతరం బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసు ప్రత్యేక సెల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ ప్రదేశంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని ఢిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ చెప్పారు.”సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇది జరిగింది, నేను నా డ్యూటీలో ఉండగా పెద్ద శబ్దం వినిపించింది. బయటికి వచ్చేసరికి చెట్టు పైనుంచి పొగలు కమ్ముకోవడం చూశాను, అంతే… పోలీసులు నా స్టేట్‌మెంట్ తీసుకున్నారు…” అని ఓ సాక్షి తెలిపారు. సమగ్ర విచారణ జరుగుతోంది. లేఖను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..