NTV Telugu Site icon

JP Nadda: జేపీ నడ్డాకు మరో కీలక పదవి..!

Nadda

Nadda

బీజేపీ రాజ్యసభ ఎంపీ జేపీ నడ్డా.. మోడీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే కీలకమైన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖలను ప్రధాన మోడీ అప్పగించారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆయన కేంద్రమంత్రి కాగా.. ఇప్పుడు రాజ్యసభలో కూడా సభా నాయకుడిగా ఏర్పాటు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Vladimir Putin – Kim Jong Un : కిమ్ ను సరదాగా కారులో తిప్పిన పుతిన్.. వీడియో వైరల్..

నడ్డా న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ సైద్ధాంతిక గురువు అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. రాజకీయ ప్రస్థానంలో అనేక కీలకమైన పదవుల్ని చేపట్టారు. తాజాగా మోడీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక రాజ్యసభలో కూడా సభా నాయకుడి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. నడ్డా ప్రస్తుతం మోడీ సొంతం రాష్ట్రం గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Canada: తీరుమార్చుకోని కెనడా.. ఖలిస్తానీల ‘‘సిటిజన్ కోర్టుల’’పై భారత్ ఆగ్రహం..

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానాలు సొంతం చేసుకుంది. ఇక బీజేపీ సొంతం 240 సీట్లు కైవసం చేసుకుంది. ప్రస్తుతం మిత్ర పక్షాల సపోర్టుతో కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పడింది.

ఇది కూడా చదవండి: Prabuthwa Junior Kalashala Review: ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ రివ్యూ