పాత సీసాలో పాత సారా లాగా వైసీపీ మేనిఫెస్టో ఉందని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 హామీలు తీర్చకుండా పాత పాటే పాడినట్టుందని, కేంద్ర పధకాల పేర్లు మార్చి వాళ్ళవిగా చెప్పుకున్నారన్నారు. ప్రధానమంత్రి స్వానిధి పధకానికి పేరు మార్చుకుని మేనిఫెస్టో లో పెట్టుకున్నారని, వైద్యరంగానికి కేంద్రం ఇచ్చే పధకం పేరు మార్చుకున్నారన్నారు సూర్యనారాయణ రాజు. కేంద్రం ఇచ్చే ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారని, బీజేపీ కేంద్రంలో ఏం చెప్పిందో అవన్నీ 100% మోదీ నేతృత్వంలో చేసి చూపించామన్నారు. కేంద్రంలో చేసినవన్నీ రాష్ట్రంలో జరుగుతాయని, వికసిత్ ఆంధ్ర వికసిత్ భారత్ గా జరిగే లాగా ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నామన్నారు సూర్యనారాయణ రాజు. రైతుల కోసం జిల్లాకి ఒక కోల్డ్ స్టోరేజ్, ధరల స్థిరీకరణ నిధి ఏమయ్యాయని అడిగారు. పోలవరం పరిస్థితి ఏంటని.. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే మూడు కోట్లతో మరమ్మతులు చేయించలేకపోయారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే ఇళ్ల నిర్మాణం, రైతు భరోసా అమలయ్యాయని తెలిపారు. ఇందులో సీఎం జగన్ చేసింది ఏముందని ప్రశ్నించారు.