ఫిరోజ్ ఖాన్ అంటేనే ఓవైసీకి వ్యతిరేకం.. ఆ వ్యక్తి కాంగ్రెస్ అసలు రంగు బయట పెట్టారని, ఓవైసీ హైదరాబాద్ లో గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం కోరుకుంటుందని ఫిరోజ్ ఖాన్ చెప్పారన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పాలించిన అన్ని పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంఐఎంను పెంచి పోషించారని, మజ్లిస్, కాంగ్రెస్ అనేక సార్లు కలిసి పని చేశాయన్నారు ప్రకాష్ రెడ్డి. ఎవ్వరికీ ఎవ్వరూ బీ టీమ్ అర్థమైందని, టగ్రెస్ పార్టీ జిన్నా మేనిఫెస్టోను అమలు చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే దేశాన్ని విభజిస్తుందన్నారు.
West Bengal: అందరు చూస్తుండగానే.. ఓ యువతికి ముద్దు పెట్టిన బీజేపీ ఎంపీ అభ్యర్థి..
అంతేకాకుండా..’కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ పదజాలం పెట్టారు. కిషన్ రెడ్డి ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తుతున్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సెక్యులరిజం పదాన్ని పాటిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. ఒక మతానికి కొమ్ము కాసి.. మత ప్రాతిపదికన నిర్ణయాలు చేసింది కాంగ్రెస్. ఇండియా కూటమి రాజకీయ సెక్యులరిజంను మాత్రమే అమలు చేస్తుంది. మోడీ పాలనను ముస్లింలు గుర్తిస్తున్నారు.. మోదికి ముస్లింలు ఓటు వేస్తారు. కాంగ్రెస్ పార్టీకి 50సీట్లు కూడా రావు.. 20 సిట్లకే పడిపోతుంది’ అని ప్రకాష్ రెడ్డి అన్నారు.
Posani Krishna Murali: చంద్రబాబు, లోకేష్ తీర్థ యాత్రలకు వెళ్తే.. ఏపీలో మేము సంతోషంగా ఉంటాం..