Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Bjp State President Bandi Sanjay Comments On Ssc Paper Leak Issue

Bandi Sanjay: రాష్ట్రంలో లీకేజీల జాతర.. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి..

Published Date :April 3, 2023 , 6:59 pm
By Mahesh Jakki
Bandi Sanjay: రాష్ట్రంలో లీకేజీల జాతర.. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bandi Sanjay: రాష్ట్రంలో పదో తరగతి తెలుగు పేపర్ లీక్‌ కావడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోందన్నారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటని బండి సంజయ్ మండిపడ్డారు.

ప్రభుత్వ చేతగానితనం విద్యార్థుల జీవితాలకు శాపంగా మారిందన్న ఆయన.. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ లీకేజీతో ప్రభుత్వ, చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందన్నారు. టెక్నాలజీని పేపర్ లీకేజీ కోసం ఉపయోగించుకుంటున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పేపర్ లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read

  • IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
  • Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్‌తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్‌
  • Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
  • Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..

Read Also:SSC Paper Leak: పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే వాట్సాప్ గ్రూప్‌లో ప్రశ్నాపత్రం.. కేసు నమోదు

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. టెన్త్ పరీక్షలు 90 శాతం సిలబస్‌తో ఒకే పేపర్ గా పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఇప్పటికే ఒత్తిడి కన్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ లీకేజ్ ఘటనతో విద్యార్థుల్లో మరింత గందరగోళం నెలకొందని తెలిపారు. మిగిలిన పరీక్షలైనా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులంతా ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలన్నారు. 10వ తరగతి తెలుగు పేపర్ లీకేజీపై న్యాయ నిపుణులతో చర్చించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ లీకేజీ వెనకాల ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దన్నారు. బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 10th paper leak
  • bandi sanjay
  • bjp state president
  • ssc 2023 exam paper leak
  • SSC Paper Leak

తాజావార్తలు

  • Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0” ప్రారంభం.!

  • IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..

  • Realme C100x: రియల్‌మీ C100x భారత్‌లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్‌ప్రైజ్!

  • Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్‌డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!

  • Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions