Somu Veerraju: ఈనెల 8వ తేదీన రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయని అన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 2250 మంది రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి నేతలు వరకు పాల్గొంటారని చెప్పారు. కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ ముఖ్య అతిథిగా, రాజ్యసభ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్గొంటారని అన్నారు. ఏపీ అభివృద్దే ప్రధాన అజెండాగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చిస్తామని, ప్రజల అభీష్టం మేరకే బీజేపీ వైఖరి ఉంటుందని అంటున్నారు.. డిపోయిన రాష్ట్రానికి అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తుందని డబుల్ ఇంజన్ సర్కార్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చి, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
Read Also: Chhattisgarh : బావిలో పడిన వ్యక్తిని రక్షించే క్రమంలో గ్యాస్ లీక్ కారణంగా నలుగురు మృతి
ఇక, జగన్ వేసిన అవినీతి బీజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని విమర్శించారు సోము వీర్రాజు.. జగన్ పాపాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ఆయన.. కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం దందా బయట పెట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు అభినందనలు తెలియజేశారు. మరోవైపు.. రాహుల్ గాంధీపై ధ్వజమెత్తుతూ.. రాహుల్ కి 100 స్థానాలు వచ్చాయి. ఆయన మాట్లాడే భాష, విజయం సాధించాం అనట్టుగా ఉందని దుయ్యబట్టారు.. విభిన్నమైన ఆలోచన గల పార్టీ బీజేపీగా పేర్కొన్నారు.. క్రైస్తవులు కొన్ని రాష్ట్రాల్లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీపై బిన్న అభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. కాశ్మీర్ లో జాతీయ పతాకం ఎగురవేయ్యలేనట్టువంటి పార్టీ కాంగ్రెస్ అని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు బీజేపీకి కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. రాముడే హీరో, అలాంటిది కాంగ్రెస్ రాముడి గుడి కాకుండా బాబర్ గుడి నిర్మించాలని రాహుల్ అంటున్నారని విమర్శించారు. రాముడు ప్రజల మనిషి, బీజేపీ వారు కాదు, స్వభిమానానికి చిహ్నం రాముడు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగం కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సోనియా గాంధీ ఇటలీ, ఆమె కుమారుడు రాహుల్ రాజ్యాంగం కోసం మాట్లాడతారని విమర్శించారు. ఇండియాలో జాతీయ జెండాలను ఎగుర వేయని పార్టీ కాంగ్రెస్ అని, కాశ్మీర్ లో ఇండియా జాతీయ జెండాను ఎగురవేసిన పార్టీ బీజేపీ అంటూ కొనియాడారు సోము వీర్రాజు.