NTV Telugu Site icon

Laxman: సామాజిక న్యాయం కోసం బీసీ సీఎం కావాలని కోరుతున్నాం

Laxman

Laxman

Laxman: బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీలో పలువురు చేరారు. కొల్లాపూర్ నుంచి బీసీ నాయకుడు, సంఘ సేవకుడు సింగోట రామన్న బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి ఆయనను లక్ష్మణ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు కోరుకుంటున్నారని లక్ష్మణ్ తెలిపారు. గతంలో మోడీ ప్రధాని అభ్యర్థిగా వస్తే తెలంగాణ ప్రజలు నిండైన మనసుతో ఆశీర్వదించడంతో ప్రధాని అయ్యారని.. పదేండ్ల తర్వాత తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తూ ఓటేస్తే బీసీ సీఎం అవుతారని మోడీ చెప్పారని లక్ష్మణ్ వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం బీసీ సీఎం కావాలని కోరుతున్నామని ఆయన అన్నారు. బీసీలందరూ ఒక్కటయ్యారన్న ఆయన.. వార్ వన్ సైడ్ అయ్యిందన్నారు. సామాజిక న్యాయం ఎన్టీఆర్‌ తర్వాత ఇప్పుడు బీజేపీ మాత్రమే చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ ఒక కుటుంబం కోసం పని చేసే పార్టీ అని, కాంగ్రెస్ దేశంలో ఒక కుటుంబం కోసం పని చేసే పార్టీ అంటూ ఆయన విమర్శించారు.

Also Read: Pawan Kalyan: బలి దానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలి

పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రధాని అయితే.. రాహుల్, ఆయన కుటుంబం ఎంతగా హేళన చేస్తున్నారో తెలుసన్నారు. ప్రజలు ఓడించినా ఇంకా కాంగ్రెస్‌కు బుద్ది రాలేదన్నారు. రాహుల్ బీసీ సమాజాన్ని హేళన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా గెలవలేని పార్టీ కాంగ్రెస్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. బీసీ సీఎం అని ప్రకటిస్తే 2 శాతం ఓట్లు వస్తాయని రాహుల్ బీసీలను హేళన చేస్తున్నాడన్నారు. అన్ని సమీకరణలు తీసుకుని 35 సీట్లు 100 సీట్లలో బీసీలకు ఇచ్చామన్నారు. బీసీ సంఘాలు ప్రధాని మోడీని కలిసి ముచ్చటించటం మా అదృష్టం అని బీసీ కుల సంఘాల అధ్యక్షులు చెప్పారని ఈ సందర్భంగా లక్ష్మణ్ చెప్పారు. మీ పీఠాలు, గడీల రాజ్యం బద్దలు కొట్టడానికి ఏకం అవుతున్నారన్నారు. బీసీలనే కాదు అన్ని వర్గాలను కేసీఆర్ వంచించారని ఆయన ఆరోపించారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇస్తే కూడా కేసీఆర్ తట్టుకోలేదని ఆయన అన్నారు.

Also Read: Janasena: జనసేన అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన పవన్‌కళ్యాణ్

కాంగ్రెస్, కేసీఆర్‌ను ఎవరినీ నమ్మినా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయితదన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఓటేయాలని కోరుతున్నానని ఆయన సూచించారు. అమ్మలాంటి తెలంగాణను కేసీఆర్ అమ్మకానికి పెడుతున్నారు.. అమ్మలాంటి దేశంను కాంగ్రెస్ అమ్మకోవాలని చూసిందని ఆయన ఆరోపించారు. నీ కుటుంబం తప్ప మరొకటి లేదు కేసీఆర్.. వందల వేల కోట్లకు కేసీఆర్ కుటుంబం పడగలెత్తిందన్నారు. ప్రవళిక లాంటి వాళ్ల ఉసురు ఊరికే పోదన్నారు.పసుపు బోర్డు మాట ఇచ్చిన తెచ్చిన వ్యక్తి అర్వింద్‌ అని, బీజేపీ అని చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదు కవితమ్మ అని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. కాంగ్రెస్ , బీఆర్‌ఎస్, మజ్లీస్ ఆర్డర్ మీద పనిచేసే పార్టీలు అంటూ ఆరోపించారు. బీసీ సీఎం అయ్యే చారిత్రాత్మకమైన నిర్ణయంలో తెలంగాణ ప్రజలు ఓటేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.