NTV Telugu Site icon

BJP: సంస్థాగత ఎన్నికలపై బీజేపీ దృష్టి.. మండల అధ్యక్షుల ప్రకటన

Bjp

Bjp

తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికలపై తీవ్రమైన దృష్టి పెట్టింది. పార్టీని బలోపేతం చేసేందుకు మండల అధ్యక్షులను ప్రకటించింది. అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత రాష్ర్ట పార్టీ అప్రూవల్ తీసుకొని బీజేపీ మండల అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. అంతేకాకుండా.. జిల్లా కౌన్సిల్ సభ్యులను కూడా ప్రకటించింది. ఈ క్రమంలో.. రేపు జిల్లా అధ్యక్షుల ఎన్నిక ఎంపికపై తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ బన్సల్ సమీక్ష చేపట్టనున్నారు. జిల్లా రిటర్నింగ్ అధికారులు, అబ్జర్వర్‌లతో ఆయన భేటీ కానున్నారు. జిల్లా అధ్యక్షులు పోటీలో ఉన్నా.. పదవి అడుగుతున్న ఐదుగురు పేర్లతో జాబితా ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ కోరింది.

Read Also: KTR: ఇంకా వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటా.. ఇదొక లొట్టపీసు కేసు

ఈ క్రమంలో.. రాష్ట్ర పార్టీకి అందిన పలు జిల్లాల అధ్యక్ష పోటీలో ఉన్న వారి లిస్ట్‌ను తయారు చేసింది. తెలంగాణలో 80 శాతం జిల్లాలకు జిల్లా అధ్యక్ష ఎన్నికకు అర్హత ఉంది. దీంతో.. జిల్లా అధ్యక్ష పదవులకు భారీ పోటీ నెలకొంది. ఈ నేపధ్యంలో నేతలు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఆశావహులు పార్టీ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఎప్పుడైనా జిల్లా అధ్యక్షుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Read Also: Bachchalamalli : “బచ్చల మల్లి” ఓటిటి రిలీజ్ డేట్ లాక్

Show comments