తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికలపై తీవ్రమైన దృష్టి పెట్టింది. పార్టీని బలోపేతం చేసేందుకు మండల అధ్యక్షులను ప్రకటించింది. అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత రాష్ర్ట పార్టీ అప్రూవల్ తీసుకొని బీజేపీ మండల అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది.
ఈ క్రమంలో, పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుండి 30వ తేదీ మధ్య బూత్ కమిటీల నియామకం పూర్తి చేయాలని నిర్ణయించింది. నవంబర్ 27న రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహణ కూడా ఏర్పాటు చేశారు. అలాగే, వచ్చే నెలలో జిల్లాస్థాయిలోనూ కార్యశాలలు ఏర్పాటు చేయాలని ఉద్దేశిస్తున్నారు.