ఎంపీల మీటింగ్ కి బీజేపీ ఒక్కటే కాదు ఏ పార్టీ హాజరు కాలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, వాట కోసం కొట్లాడేది బీజేపీ తప్ప ఎవరు లేరన్నారు. మమ అనిపించుకునేందుకే సమావేశం నిరహించారని చెప్పారు.. ఢిల్లీ వేదికగా చర్చ చేద్దాం.. 28 అంశాల్లో ఏవేవి పెండింగ్ లో ఉన్నాయో చర్చ చేద్దాం.. ఢిల్లీలో పెట్టండి మీటింగ్ అని సవాల్ విసిరారు. అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని.. రండి ఢిల్లీకి చర్చ చేద్దాం, రేపు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి చర్చా చేద్దామన్నారు. ఇచ్చిన హామీలపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. కేంద్రం ఏం ఇచ్చిందని చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం వల్లే ఎమ్మెల్సీ ఓడిందని విమర్శించారు..
READ MORE: Rahul Gandhi: “రాహుల్ గాంధీనే మాకు పెద్ద ఆస్తి”.. గుజరాత్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు..
“ఓడినా గెలిచిన ఈ ప్రభుత్వం కి వచ్చిన నష్టం ఏమి లేదని అన్నావు. మేము కష్టపడ్డాం కాబట్టి ఎమ్మెల్సీ లో రెండు స్థానాల్లో గెలిచాం. ఆడలేక బీజేపీ- బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చేస్తున్నారు. రెండు చోట్ల పెట్టేందుకు కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకలేదు. ఒవైసీకి దమ్ముంటే 16 పార్లమెంట్ నియోజక వర్గాల అభివృద్ధితో పోటీ పడాలి. ఒవైసీ వల్లే ఓల్డ్ సిటీలో చెదలు పట్టింది. ఒవైసీ కి దమ్ముంటే తన పార్లమెంట్ అభివృద్ధిపై చర్చకు రావాలి. స్టాలిన్ అరుస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి అరుస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి స్టాలిన్ అరిస్తే ఓ లెక్కుంది. రేవంత్ రెడ్డి ఎందుకు అరుస్తున్నారు. 1977 సేన్సెస్ తీసుకొని డీలిమిటిషన్ చేయాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో లేరు, స్టేట్ లో ఉంటారో లేరో తేల్చుకోవాలి… ఎప్పుడు రేవంత్ పదవి పోతుందో తెలియదు. స్టాలిన్ ను , అయన కొడుకుని కనమనండి పిల్లల్ని ముందు..” అని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు.