ఎంపీల మీటింగ్ కి బీజేపీ ఒక్కటే కాదు ఏ పార్టీ హాజరు కాలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, వాట కోసం కొట్లాడేది బీజేపీ తప్ప ఎవరు లేరన్నారు. మమ అనిపించుకునేందుకే సమావేశం నిరహించారని చెప్పారు.. ఢిల్లీ వేదికగా చర్చ చేద్దాం.. 28 అంశాల్లో ఏవేవి పెండింగ్ లో ఉన్నాయో చర్చ చేద్దాం.. ఢిల్లీలో పెట్టండి మీటింగ్ అని సవాల్ విసిరారు. అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని.. రండి ఢిల్లీకి…
రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం చర్చించనుంది. పెండింగ్ సమస్యల పరిష్కారంపై సమ్మె బాట పడతామని ఏపీఎన్జీవోలు హెచ్చరించడంతో ఉద్యోగ సంఘాల నేతలతో సంప్రదింపులు జరపనుంది. కాగా.. ఐఆర్, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా.. పెండింగ్ డీఏలతో పాటు రిటర్మైంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పట్టు పడుతున్నాయి.
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో గంటసేపు సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్ సమస్యలను ప్రధానికి నివేదించారు. ఈమేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించారు సీఎం జగన్. రాష్ట్ర విభజన పర్యవసానాలు ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బ తీశాయన్నారు సీఎం. రాష్ట్ర విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ…