లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 11 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన, రేవంత్ రెడ్డి 18 నెలల పాలన బేరీజు వేస్తే.. తెలంగాణ సీఎం పాలన ఏందో తెలుస్తుందన్నారు. రేవంత్ తన సీటును కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నారని, ముఖ్యమంత్రి పదవిని రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. బీజేపీ భరోసా కార్యక్రమంకి వందల మంది సమస్యలు పట్టుకొని వస్తున్నారని, లంచం ఇస్తే కానీ పనులు జరుగుతలేవని చెబుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. నేడు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు.
Also Read: Kaleshwaram Commission: విచారణ అనంతరం ఫామ్‌హౌస్‌కు హరీష్ రావు.. కేసీఆర్‌తో భేటీ!
‘ప్రధాని నరేంద్ర మోడీ భారత దేశాన్ని అగ్ర రాజ్యాల సరసన చేర్చారు. భారత్ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 4వ స్థానానికి తెచ్చారు. రాహుల్ గాంధీ , రేవంత్ రెడ్డి మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు. 11 ఏళ్ల మోడీ పాలన, రేవంత్ 18 నెలల పాలన బేరీజు వేస్తే.. రేవంత్ పాలన ఏందో తెలుస్తుంది. రాహుల్ గాంధీని కలవడానికి 45 సార్లు ఢిల్లీకి రేవంత్ వెళ్ళారు. రేవంత్ తన సీటును కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి పదవిని రాహుల్ దగ్గర తాకట్టు పెట్టారు. తెలంగాణ నుండి డిల్లీకి మూటలు మోస్తున్నారు. రాహుల్ రాయబారివా లేదా తెలంగాణకు జవాబుదారివా రేవంత్. బీజేపీ భరోసా కార్యక్రమంకి వందల మంది సమస్యలు పట్టుకొని వస్తున్నారు, లంచం ఇస్తే కానీ పనులు జరుగుతలేవని చెబుతున్నారు. ఈ రోజు కలెక్టర్లు, అధికారులు, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడాను. పనులు జరుగుతాయని మంత్రి హామీ ఇచ్చారు’ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు.