NTV Telugu Site icon

GVL Narasimha Rao: SBI-CSR నిధులతో సంక్రాంతి వేడుకలు.. సీపీఎంపై జీవీఎల్‌ కౌంటర్‌ ఎటాక్‌

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

GVL Narasimha Rao: మహాసంక్రాంతి వేడుకల విరాళాలపై రాజకీయ విమర్శలకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు.. SBI-CSR నుంచి 65 లక్షల రూపాయలు తీసుకోవడంపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విదితమే కాగా.. సీపీఎం నేతలపై మండిపడ్డారు జీవీఎల్.. కనుమరుగైన వామపక్ష పార్టీలవి చౌకబారు విమర్శలు.. సాంస్కృతిని మరిచి పోయిన కమ్యూనిస్టులు.. చైనా వేడుకలు ఇక్కడ నిర్వహించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే నైజం వామపక్షాలదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర సంప్రదాయాలు కొనసాగించాలని పార్టీలకు అతీతంగా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నాం.. ఇవాళ జరగనున్న మహాసంక్రాంతి ముగింపు వేడుకల్లో 10 మందికి పైగా ఎంపీలు పాల్గొంటున్నారని తెలిపారు. ఛాలెంజ్ చేస్తున్నా ఈ సంక్రాంతి వేడుకల్లో ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపించగలరా..? అంటూ సవాల్‌ విసిరారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.

Read Also: Suriya: కంగువ సెకండ్ లుక్ రిలీజ్… పీరియాడిక్ కాదు సెమీ పీరియాడిక్

కాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు. SBI-CSR నిధులతో సంక్రాంతి సంబరాలు చేయడం విమర్శలకు కారణం అయ్యింది. నాలుగు రోజుల వేడుక కోసం సుమారు 65 లక్షలు SBI కేటాయించడాన్ని సీపీఎం ఆక్షేపిస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలనే బలమైన కోరికతో ఉన్న జీవీఎల్.. దాదాపు ఏడాదిన్నర క్రితమే సాగర తీరంలో స్థిరనివాసం ఏర్పరుచుకుని పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే ఢిల్లీ లేకపోతే వైజాగ్ అనేంతగా జీవీఎల్ వ్యవహారం ఉంది. ఎన్నికల్లో పోటీపై కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ ఎంపీ.. కలిసి వచ్చిన ప్రతీ వేదికను తనకు అనుకూలంగా మలుచుకుని విశాఖ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా ఎదురయ్యే రాజకీయ విమర్శలను ఇగ్నోర్ చేయడం ద్వారా ఎంపీ అవ్వాలనే టార్గెట్ రీచ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

Read Also: Filmfare Awards 2024 nominees: ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు ఏకంగా 19 నామినేషన్లు.. షారుక్ ఖాన్ రెండు సినిమాలు..

ఈ క్రమంలో మహా సంక్రాంతి పేరుతో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ట్రెడిషనల్ ఫెస్ట్ నిర్వహించారు జీవీఎల్. ఉత్తరాంధ్ర జానపద కళారూపాలకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే అనేక కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయగా.. నగర వాసుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి మేఘావల్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహా సంక్రాంతి నిర్వహణ, ప్రమోషన్ ద్వారా వచ్చే ఎన్నికల కోసం జీవీఎల్ ప్రచారం ప్రారంభించినట్టే లెక్క. రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకలు జరుగుతున్నట్టు చెబుతున్నప్పటికీ ఎంపీ జీవీఎల్ చుట్టూ విమర్శలు ముసురుకుంటున్నాయి. దీనికి కారణం, మహా సంక్రాంతి సంబరాల నిర్వహణ నిధుల్లో సింహాభాగం SBI నుంచి రావడమే. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సి బులిటీ కోసం కేటాయించిన సుమారు 65 లక్షల రూపాయలను జీవీఎల్ కోరిక మేరకు సంబరాల కోసం ఖర్చు పెట్టారనేది సీపీఎం అభ్యంతరం. బడ్జెట్ కేటాయింపులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా.. టీమ్ జీవీఎల్ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది.. CSR నిధులను సాంస్కృతిక కార్యక్రమాలకు ఇవ్వ కూడదని ఎక్కడా లేదని.. అనవసర రాజకీయాలతో బురదజల్లొద్దని హెచ్చరిస్తున్నారు.