Site icon NTV Telugu

BJP MP Nagesh: బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ కేసులు పెట్టిస్తుంది..

Bjp Mp

Bjp Mp

BJP MP Nagesh: ఆదిలాబాద్ లో బీజేపీ ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావ్ పాటిల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ సర్కార్ కూడా కేసులు పెట్టిస్తుంది అని ఆరోపణలు గుప్పించారు. భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో మీటింగ్ దగ్గర శాంతి యుతంగా నిరసన చేస్తే హనుమాన్ భక్తులను సైతం జైల్లో పెట్టారు.. పోలీసులు కనీసం మానవత్వం లేకుండా ఆ ఇష్యూతో సంబంధం లేని వాళ్ళను సైతం ఇంట్లోకి వెళ్ళి పట్టుకొచ్చారు.. తప్పుడు కేసులు ఎత్తి వేయాలి అని డిమాండ్ చేశారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఎంపీ నగేష్ కోరారు.

Read Also: AP Crime: రాజమండ్రిలో డబుల్‌ మర్డర్‌..! అన్నదమ్ముల మృతితో కలకలం

ఇక, హిందువులతో గొక్కున్న పార్టీలు రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోయాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రశ్నించే విధంగా లేదా కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేకరులను వేధిస్తున్నారు.. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు. వేధింపులకు లేదా బెదిరింపులకు పాల్పడే పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈలాంటి చిల్లర రాజకీయాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రజల కోసం తాము నిరంతరం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.

Exit mobile version