NTV Telugu Site icon

Dharmapuri Arvind: ట్రంప్ మోడీని కుర్చీలో దగ్గరుండి కూర్చోపెడుతున్నారు.. రేవంత్ ఓ లెక్కా!

Dharmapuri Arvind

Dharmapuri Arvind

కేంద్రం ఇస్తోంది.. కానీ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని రేవంత్ అంటున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.. ఇటీవల ఓ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణకు మోడీ 7 జవహర్ నవోదయ విద్యాలయాలు ఇచ్చారు. నా పార్లమెంట్ పరిధిలో జగిత్యాల, నిజామాబాద్ లో ఒకటి చొప్పున రెండు వచ్చాయి. పార్టీలకతీతంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాను. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎక్కువగా చేరుతారు కాబట్టి జిల్లా కేంద్రంలో పెట్టాలని నిర్ణయించాం. నిజామాబాద్ లో స్టార్ట్ అయింది.. ఆల్రెడీ కొనసాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ లో పెట్టాలని ప్రెజర్ పెడితే నేను ఆయన్ను ఒప్పించుకున్నా. అన్నీ ఒకే అనుకున్నాక బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవనట్టేనా. వీళ్లకు పని చేయడం చేతకాదు. చేస్తున్న వారిని చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. సుదర్శన్ లెటర్ హెడ్ కూడా కొట్టించుకోవడం లేదు. మంత్రి పదవి ఇచ్చాకే లెటర్ హెడ్ సిద్ధం చేసుకుంటాడట. ఆయనకు మతిస్థిమితం పీకింది.. ముసలోడికి ఏదీ చేతకావడం లేదు. ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. తెల్ల బట్టలు వేసుకుని బిల్డప్ ఇవ్వడం తప్ప ఏం పీకుతున్నాడు. పనికిమాలిన రాజకీయాలతో మంచి ఇనిస్టిట్యూట్ లు రాకుండా పోతున్నాయి. గల్లీ లీడర్ లాగా సుదర్శన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇంకా బుద్దిలేకుండా మంత్రి పదవి కావాలని కోరుతున్నారు. నయా పైసా పని చేయడు.. ముస్లింల(తురక) ఓట్లతో గెలుస్తున్నాడు.” అని ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.

READ MORE:Harihara Veeramallu: ఏపీలో హరిహర వీరమల్లు షూట్.. పవన్ కోసం వెయిటింగ్!

మంత్రి శ్రీధర్ బాబు మేము పరిశీలిస్తున్నామన్నాడు.. ఇదేనా పరిశీలించడం అని బీజేపీ ఎంపీ ప్రశ్నించారు. “మీకు నేను స్కూల్ తెస్తుంటే ఇలా బురదజల్లుతారా?. సుదర్శన్ రెడ్డి మెదడు మోకాలుకు జారింది.. ఇప్పుడు అరి కాళ్లకు జారుతుంది. చటాకు మెదడు ఉన్న ఎవడైనా మోడీతో మంచిగా ఉంటాడు. ట్రంప్ లాంటి వ్యక్తే మోడీతో మంచిగున్నాడు. కుర్చీలో దగ్గరుండి కూర్చోపెడుతున్నాడు. రేవంత్ ఒక లెక్కనా. రేవంత్ వస్తానంటే బీజేపీలోకి ఆహ్వానిస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ లో అడ్మినిస్ట్రేషన్ వాక్యూమ్ ఉంది. దానికి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. రాహుల్ గ్రహాంతరవాసి. సీఎం పదవి తొలగిస్తే రేవంత్ చూస్తూ ఊరుకుంటాడా? నిజంగా అదే జరిగితే వ్యక్తిగతంగా బీజేపీలోకి ఆహ్వానిస్తా. ఆయన్ను తీసుకుంటారా? లేదా అనేది మాత్రం నా చేతిలో లేదు. కిషన్ రెడ్డిని తిట్టాడు కాబట్టి ఆయన తీసుకుంటారా లేదా అనేది చూడాలి. బీజేపీ నేతలు సీఎం చెవిలో ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఎలా అంటారు. కాంగ్రెస్ నేతలు, రేవంత్ కూడా నాకు మిత్రుడే. ఫ్యూచర్ సిటీకి లోటస్ అని పేరు పెడతాడేమో.. అందుకే మోడీని మంచోడని పొగుడుతున్నట్టున్నాడు. అలా పెట్టుకుంటామంటే కచ్చితంగా అనుమతిస్తాం. పసుపు బోర్డు గురించి విమర్శలు చేస్తున్న కవితపై స్పందించమని మా జిల్లా నేతలకు చెబుతా. అలాంటి ఔట్ డేటెడ్ లీడర్ల గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు?” అని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు.