CM Ramesh: ఏపీలో ఎన్నికల పొత్తులు.. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. పొత్తులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు కీలక సమావేశం జరగనుంది.. ముందుగా ఈ సమావేశానికి బీజేపీ నేత తరుణ్ చుగ్ హాజరుకావాల్సి ఉండగా.. వేరే కార్యక్రమాలు ఉండడంతో ఏపీ పర్యటనను తరుణ్ చుగ్ రద్దు చేస్తున్నారు.. అయితే, జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ నేతృత్వంలో ఏపీ బీజేపీ ముఖ్య నేతల భేటీ సాగనుంది.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.. పొత్తులపై ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తైంది.. ఏపీ ముఖ్య నేతలమంతా పొత్తులపై మా అభిప్రాయాలు అధిష్టానానికి చెప్పేశాం అన్నారు. ఇక, పొత్తులపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు.
Read Also: Hanuman Pre Release Event: ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి?
Also Read
రాష్ట్ర స్థాయిలో పొత్తులపై చెప్పేదేం ఉండదు అన్నారు ఎంపీ సీఎం రమేష్.. పార్టీలో కొంత మంది నేతలు పొత్తులపై అనవసరంగా కామెంట్లు చేస్తున్నారన్న ఆయన.. పొత్తులపై మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా కొందరు నేతలు వినడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక, ఇవాళ్టి సమావేశాలో పొత్తులపై మాట్లాడే నేతలను కట్టడి చేయాలని కోరతాం అన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది బీజేపీ కూటమితో కూడిన ప్రభుత్వమే అని ప్రకటించారు. కానీ, ఆ కూటమిలో ఎవరెవరు ఉండాలో జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తుందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్. కాగా, ఇవాళ్టి సమావేశాలకు ముఖ్యనేతలను మాత్రమే ఏపీ బీజేపీ ఆహ్వానించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!