Armur MLA Rakesh Reddy Fires on EX MLA Jeevan Reddy: తాను ఎవ్వరికీ భయపడను అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. తనను చంపడం ఎవరి తరం కాదని, అలాంటి పరిస్థితి వస్తే మగధీర సినిమాలో రామ్ చరణ్‌లా అందరినీ చంపి చస్తానన్నారు. విదేశాల నుంచి తనకు బెదిరింపు కాల్స్ ఇంకా వస్తున్నాయని.. నీ అంతు చూస్తానని, చంపుతామని ఫోన్‌లో బెదిరిస్తున్నారని రాకేష్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలను ఒక్కకటి బయటకు తీస్తానని రాకేష్ రెడ్డి చెప్పారు.
బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ ఇంకా వస్తున్నాయి. నీ అంతు చూస్తానని, చంపుతామని ఫోన్‌లో బెదిరిస్తున్నారు. అక్రమ మైనింగ్, మాల్ అంశాల జోలికి పోవద్దని కాల్స్ చేస్తున్నారు. బెదిరింపు కాల్స్‌పై పోలీసులకు పిర్యాదు చేస్తా. గత పదేళ్లలో జరిగిన మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాల్సిందే. సీబీఐ డైరెక్టర్‌ను కలిశాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ పంపాలని అడిగారు. త్వరలో హోం మంత్రి, సీఎంను కలుస్తా’ అని రాకేష్ రెడ్డి చెప్పారు.
Also Read: TSRTC Bus: పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు!
‘ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలను ఒక్కకటి బయటకు తీస్తా. నన్ను చంపడం ఎవరి తరం కాదు. అలాంటి పరిస్థితి వస్తే.. మగధీర సినిమాలో రామ్ చరణ్‌లా అందరినీ చంపి నేను చస్తా. నేను ఎవ్వరికీ భయ పడను. అందరి బాగోతాలు బయటపెడుతా’ అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన రాకేష్ రెడ్డి మంచి మెజారిటీతో గెలిచారు.