Site icon NTV Telugu

BJP MLA Raja Singh: “మీకు గులాం గిరి చేసేవాళ్లకే పోస్టులు, టికెట్లు”.. సొంత పార్టీపై రాజాసింగ్ ఫైర్

Raja Singh

Raja Singh

నీ మనిషి నా మనిషి అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ తమాషా అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావుని పార్టీ ప్రకటించిన నేపథ్యంలో రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలపై మరోసారి మండిపడ్డారు. “బీజేపీలో ఉన్న ఆ పెద్ద అధికారి మేకప్ మెన్, ఆఫీస్ టేబుల్ ఎవరు సాఫ్ చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు పెద్ద పెద్ద టికెట్లు ఇస్తున్నారు. అన్ని పోస్టులు మీ పార్లమెంట్ మెంబర్స్ కే వస్తాయి. మిగతా పార్లమెంట్లో బీజేపీ కార్యకర్తలు అధికారి సీనియర్లు కనబడత లేరా? చేసేవాళ్లకే పోస్టులు టికెట్లు మిగతావాళ్లు మీ గులాంగిరి చేయరు కదా అందుకోసం వాళ్లకి పక్క పెడుతున్నారు.” అని ఆయన అన్నారు.

READ MORE: RS Praveen: తెలంగాణ భవన్‌కు మారు వేషంలో పోలీసులు.. ఎందుకు వచ్చారని ప్రశ్నించగా..

“అందరి హిందువులు ఒకటి కావాలి రామరాజ్యం రావాలి అనే ఉద్దేశంతో శ్రీరామ నవమి శోభాయాత్ర తీస్తా. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా నాపై ఎన్నో కేసులు పెట్టారు. అయినా.. అస్సలు భయపడకుండా నేను తీస్తున్నాను. నా శ్రీరామనవమే శోభ యాత్రలో రామభక్తులు తక్కువ రావాలని ఉద్దేశంతోనే అంబర్‌పేట్ నుంచి ఇంకొక శోభాయాత్ర గౌతమ్ రావు తీస్తున్నారు. అందుకే ఈ గౌతమ్ రావు ఈయనకి టికెట్ ఇచ్చారు. మీరు కాదు మీ అయ్యలు కూడా ప్రయత్నం చేస్తే నా దగ్గర వచ్చిన రామ భక్తులకి మీరు ఆపలేరు.” అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యానించారు.

READ MORE: UP: కోర్టు హాల్‌లో లాయర్‌ను చితకబాదిన మహిళలు.. అసలేం జరిగిందంటే..!

Exit mobile version