Kangana Ranaut: ప్రచారం ప్రారంభించిన రోజే కాంగ్రెస్‌పై విసుర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి, మండి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్ శుక్రవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గానికి కంగనా చేరుకోగానే బీజేపీ కార్యకర్తలు, నేతలు భారీ స్వాగతం పలికారు. ఆమెపై పూల వర్షం కురిపించారు. అనంతరం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా ఆమెకు ప్రజలు, మహిళలు బ్రహ్మరథం పట్టారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తనకు బీజేపీ సీటు ప్రకటించగానే కాంగ్రెస్ నాయకులు చౌకబారు రాజకీయలు చేశారని ధ్వజమెత్తారు. తన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఏ మాత్రం అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ గాంధీ అయితే హిందువుల్లోని ‘శక్తి’పై, మహిళలను గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు మహిళలంటే గౌరవం లేదని కంగనా విమర్శించారు. కాంగ్రెస్ నీచమైన రాజకీయాలకు తెరలేపిందని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి కంగనా రనౌత్‌ను బీజేపీ ఎన్నికల బరిలోకి దించింది. ఈ క్రమంలో కంగనా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు చేశారు. రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. అనంతరం ఆమె ట్వీట్‌కు కంగనా ధీటుగా బదులిచ్చారు. అయితే ఆ పోస్టు తాను చేయలేదని.. తన సోషల్ మీడియా అకౌంట్ యాక్సెస్ కలిగిన ఎవరో చేసి ఉంటారని సుప్రియా వివరణ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: R Krishnaiah: సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు..
ఇక కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథేకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళలను కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు చేపట్టింది. మార్చి 29 సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది.
ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఇక చివరి విడత జూన్ 1న జరగనుంది. ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. అన్ని పార్టీలు విజయం కోసం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వికసిత్ భారత్ కోసం ఎన్డీఏకు 400 సీట్లు ఇవ్వాలని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Sriranga Neethulu : సుహాస్ ‘ శ్రీరంగనీతులు ‘ ట్రైలర్ వచ్చేసింది..
#WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha seat, actor Kangana Ranaut says, "… Congress could not accept my nomination from Mandi. They started doing cheap politics. Their leader Rahul Gandhi talks about destroying the 'shakti' in Hindus. Their spokesperson… pic.twitter.com/D53fySekCz
— ANI (@ANI) March 29, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
-
Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
-
Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!