Bihar: బీహార్‌లో బీజేపీ-ఆర్జేడీ సీట్ల సర్దుబాటు.. నితీష్‌కు ఎన్ని సీట్లంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలోకి ఆర్జేడీ అధినేత నితీష్‌కుమార్ వెళ్లారు. అంతేకాదు.. బీజేపీ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై బీజేపీ-ఆర్జేడీ మధ్య ఒప్పందాలు జరిగాయి.
లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా బీహార్ (Bihar)లో ఎన్డీయే (NDA) భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు 14 సీట్లను బీజేపీ ఆఫర్ చేయగా, చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరస్‌కు-6 సీట్లు బీజేపీ ఆఫర్ చేసింది. ఉపేంద్ర కుష్వాహ, మాంఠీ (హెచ్ఏఎం)కు చెరో సీటు ఇవ్వనుంది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది.
Also Read
- Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
- Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
- రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
- Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల షేరింగ్ ఫార్ములాపై బీజేపీ ఎన్నికల కమిటీ మంగళవారం సమావేశమైంది. నిత్యానంద రాయ్, గిరిరాజ్ సింగ్, సుశీల్ మోడీ, సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, బీహార్ ఇన్‌చార్జి వినోద్ తావ్డే, రాధా మోహన్ సింగ్, నాగేంద్ర కుమార్, తారాకిషోర్ ప్రసాద్, నందకిషోర్ యాదవ్, ధర్మశీల గుప్తా, ప్రేమ్‌కుమార్, జానక్ రామ్, ప్రేమ్ రంజన్ పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ ఎల్‌జీపీలు ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నారు. ఈసారి 2024లో బీజేపీ, జేడీయూతో పాటు ఉపేంద్ర కుష్వాహ (రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ), జితిన్ రామ్ మాంఝీ (హిందుస్థానీ అవామీ మోర్చా), లోక్ జనశక్తి పార్టీకి చెందిన రెండు వేర్వేరు పార్టీలు (పశుపతి పరస్, చిరాగ్ పాశ్వాన్) ఎన్డీయే భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే బీహార్‌లో 14 సీట్లతో పాటు జార్ఖండ్‌లోని ఛాత్ర సీటు, ఉత్తరప్రదేశ్‌లో ఫూల్‌పూర్ సీటును జేడీయూ కోరుతోందని.. దీనిపై చర్చలు జరుగుతున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే ఇటీవలే 195 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ప్రధాని మోడీ వారణాసి నుంచి తిరిగి మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా చుట్టేస్తున్నారు. మరికొద్దిరోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
తాజావార్తలు
-
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
-
Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
ట్రెండింగ్
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!