Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్లు ఎమోషనల్ అయ్యే సందర్భాలు చాలానే చూశాం. కానీ, ఒక సినిమా వేడుకలో ఏకంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముందే స్టేజ్‌పై భావోద్వేగానికి గురై, ఆయన మాటలే తనకు స్పూర్తి అంటూ కంటతడి పెట్టుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ హీరోయిన్ అలా ఎందుకు ఎమోషనల్ అయ్యారు? వారి మధ్య ఉన్న ఆ అనుబంధం వెనుక అసలు కథేంటి? అనేది చూద్దాం.
సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా, ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంత కష్టంతో పైకి వచ్చి స్టార్ డమ్ సంపాదించుకోవడం అంత ఆషామాషీ కాదు. సరిగ్గా ఇదే విషయాన్ని ఆ హీరోయిన్ ఓపెన్‌గా చెప్పుకొచ్చారు. “లైఫ్‌లో మనల్ని నమ్మేవాళ్లు ఎవరూ లేకపోయినా, ఏమీ లేని రోజుల్లోనూ అంతే కాన్ఫిడెంట్‌గా, అంతే స్ట్రెంత్తో ఎలా నిలబడాలో నేను విజయ్ గారి జర్నీ చూసి నేర్చుకున్నాను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వాళ్లందరినీ ఆలోచోనలో పడేశాయి. ఎప్పుడైనా కెరీర్లో భయం వేసినప్పుడు, మీడియా ముందు మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపించినప్పుడు తాను నేరుగా యూట్యూబ్‌లో విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూలు చూసి ధైర్యం తెచ్చుకుంటానని ఆమె చెప్పడం విశేషం. బయట నుంచి చూసేవాళ్లకు ఇదొక సాధారణ ఫ్యాన్ మూమెంట్‌లా అనిపించినా, కష్టకాలంలో ఒక వ్యక్తిని ఏ స్థాయిలో ఇన్స్పైర్ చేయవచ్చో ఈ ఘటన అద్దం పడుతోంది.
Also Read
- Global Box Office: చిన్న బడ్జెట్.. పెద్ద దెబ్బ! 'రామాయణ'ను దాటేసిన జపనీస్ రాక్షసుడు..
- Athulya Chandra: హీరోయిన్ అతుల్య చంద్ర కేసులో షాకింగ్ ట్విస్ట్.. అడ్డంగా బుక్కైన కీచక డాక్టర్ విదేశాలకు పరార్!
- Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న 'రణబాలి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
ఇండస్ట్రీలో చాలామంది తనను “నీకు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇక్కడిదాకా ఎలా వచ్చావు?” అని తరచూ అడుగుతుంటారని, కానీ ఆ మాటలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. “నా వెనుక నా తల్లిదండ్రుల అండదండలు ఎప్పుడూ ఉన్నాయి. ఏ రోజు కూడా నా కష్టాలను నన్ను ఒంటరిగా ఎదుర్కోనివ్వలేదు. అలాగే నా ప్రతి విజయానికి నా బ్రదర్స్, నా స్నేహితులు నన్ను నానావిధాలుగా ప్రొటెక్ట్ చేస్తూ వెన్నంటే నిలబడ్డారు. అందుకే ఈ స్థాయికి రాగలిగాను” అంటూ తన సక్సెస్ వెనుక ఉన్న అసలు మనుషులను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మరోపక్క విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన తీసుకురాగానే బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్ ను చూసి ఆమె బ్లష్ అయింది. వైష్ణవి ఆనంద్ తో ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి కూడా పీటలు ఎక్కనున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ స్పీచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో, టాలీవుడ్ వర్గాల్లో ఈ ఆసక్తికరమైన చర్చ హాట్ టాపిక్‌గా మారింది. కష్టాలను ఎదురుకుని నిలబడే ప్రతి ఒక్కరికీ ఈ రియల్ లైఫ్ జర్నీ ఒక చక్కటి స్పూర్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు!
తాజావార్తలు
-
Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!