Naga Vamsi : ట్రైలర్లో ఆనంద్ ముద్దు సీన్.. ’90స్’ డైరెక్టర్‌పై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగవంశీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్, ముద్దు సన్నివేశాలపై వస్తున్న విమర్శలకు నిర్మాత నాగవంశీ దీటుగా బదులిచ్చారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో హీరో ఆనంద్ ముద్దు సన్నివేశంపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. ’90స్’ లాంటి క్లీన్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ ఆదిత్య, ఇప్పుడు ఇలాంటి సినిమా తీశాడేంటని ట్విట్టర్లో వస్తున్న నెగెటివిటీపై వంశీ గట్టిగా స్పందించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఒక ముగ్గురు ఈవెంట్ కి వచ్చిన వారిని పిలిచి వారి అభిప్రాయాలు చెప్పించారు. ఈక్రమంలోనే ట్రైలర్లో ఒక ముద్దు సీన్ ఉన్నంత మాత్రాన అది అడల్ట్ సినిమా అయిపోదని, ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ స్వచ్ఛమైన ప్రేమకథ అని ఆయన స్పష్టం చేశారు.
ఈ కమర్షియల్ చిత్రంలో ఒక భారీ ప్రయోగం చేసినట్లు నాగవంశీ వెల్లడించారు. 2 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో, ఏకంగా గంటా 40 నిమిషాల పాటు ఆనంద్, వైష్ణవి మధ్య కేవలం సంభాషణలే ఉంటాయని తెలిపారు. నిజామాబాద్, వనపర్తి లాంటి రూరల్ నేపథ్యం నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్ లేని ఒక కుర్రాడిని, అత్యంత ఆత్మవిశ్వాసం ఉన్న ఒక అమ్మాయి తన ప్రేమతో ఎలా మార్చింది, అతని అభద్రతాభావాన్ని ఎలా పోగొట్టింది అనే ప్రాక్టికల్ అంశాలను దర్శకుడు ఆదిత్య అద్భుతంగా తెరకెక్కించారని వివరించారు. డబ్బులున్న గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఈ సినిమాను మరింత ఎంజాయ్ చేస్తారని సరదాగా వ్యాఖ్యానించారు. రెగ్యులర్ సినిమాల్లాగా రొటీన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాకుండా, ఇద్దరు ప్రేమికుల మధ్య వచ్చే ప్రాక్టికల్ సమస్యలను ఈ సినిమాలో చూపించామన్నారు. గర్ల్‌ఫ్రెండ్, భార్య లేదా తల్లి.. ఇలా ఎవరితోనైనా వెళ్లి ఈ సినిమాను నిర్భయంగా ఎంజాయ్ చేయవచ్చని నాగవంశీ హామీ ఇచ్చారు. ఏ డైరెక్టర్ అయినా వారి టాలెంట్‌ను బట్టి ఏ జానర్ అయినా తెరకెక్కించవచ్చని, సుమ డైరెక్ట్ చేసినా ముద్దు సీన్లు పెట్టొచ్చంటూ విమర్శకులకు కౌంటర్ వేశారు. ఒక నిర్మాతగా కాకుండా ఆడియన్‌గా చూసుకుంటే రామ్-కామ్ అనేది తన ఫేవరెట్ జానర్ అని, ‘ఏ మాయ చేశావే’ లాంటి ఫీల్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో కచ్చితంగా దొరుకుతుందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం సినిమా చూసి ట్విట్టర్లో తనకు జెన్యూన్ రివ్యూలు చెప్పాలని ప్రేక్షకులకు వంశీ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!