Site icon NTV Telugu

Sujana Chowdary: చంద్రబాబు-అమిత్ షా-జేపీ నడ్డా భేటీ.. సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు

Sujana Chowdary

Sujana Chowdary

Sujana Chowdary: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. అర్ధరాత్రి సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిపారు.. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పనిచేసే దిశగా చర్చలు సాగించారు. అయితే, ఈ భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సుజనా చౌదరి (వైఎస్‌ చౌదరి).. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. చంద్రాబాబు, అమిత్ షా, జేపీ నడ్డాల మధ్య చర్చలు చాలా “పాజిటివ్” గా జరిగాయని తెలిపారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించిన స్థానాల కంటే కూడా ఎక్కువగానే సాధిస్తుందని నా అంచనా అన్నారు.

Read Also: CM Jagan Delhi Tour: హస్తినలో పొలిటికల్‌ హీట్.. నేడు ఢిల్లీకి సీఎం జగన్‌

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందన్నారు సుజనా చౌదరి.. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు రావడానికి చంద్రబాబే సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. పొడచూపిన విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు గతంలో జరిగాయి.. కానీ, ఫలించలేదన్న ఆయన.. స్వర్గీయ అరుణ్ జైట్లీ బతికి ఉన్నట్లయితే… ఏపీలో ఈ విభేదాలు, పరిస్థితులు ఇలా ఉండేవి కావన్నారు. చర్చలు, సఖ్యత అన్నది రెండు వైపులా సానుకూల పరిస్థితులు ఉంటేనే కదా జరిగేది..? అని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో మరలా కలిసి, మెలిసి పని చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, శాశ్వత మిత్రత్వం ఏమీ ఉండదు.. బీహార్ లో నితీష్ కుమార్ ఉదంతం మనకు తెలిసిందే కదా..? అని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంది.. రాష్ట్రాలకు పలు ప్రయోజనాలు చేకూర్చుకుంటున్నాయని.. అందుకు ఒడిశా, తమిళనాడులే ఉదాహరణగా తెలిపారు. దేశంలో రానున్న రోజుల్లో అదే జరుగుతుందని నా భావనగా వెల్లడించారు బీజేపీ నేత సుజనా చౌదరి.

Exit mobile version