Sujana Chowdary: చంద్రబాబు-అమిత్ షా-జేపీ నడ్డా భేటీ.. సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sujana Chowdary: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. అర్ధరాత్రి సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిపారు.. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పనిచేసే దిశగా చర్చలు సాగించారు. అయితే, ఈ భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సుజనా చౌదరి (వైఎస్ చౌదరి).. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. చంద్రాబాబు, అమిత్ షా, జేపీ నడ్డాల మధ్య చర్చలు చాలా “పాజిటివ్” గా జరిగాయని తెలిపారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించిన స్థానాల కంటే కూడా ఎక్కువగానే సాధిస్తుందని నా అంచనా అన్నారు.
Read Also: CM Jagan Delhi Tour: హస్తినలో పొలిటికల్ హీట్.. నేడు ఢిల్లీకి సీఎం జగన్
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందన్నారు సుజనా చౌదరి.. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు రావడానికి చంద్రబాబే సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. పొడచూపిన విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు గతంలో జరిగాయి.. కానీ, ఫలించలేదన్న ఆయన.. స్వర్గీయ అరుణ్ జైట్లీ బతికి ఉన్నట్లయితే… ఏపీలో ఈ విభేదాలు, పరిస్థితులు ఇలా ఉండేవి కావన్నారు. చర్చలు, సఖ్యత అన్నది రెండు వైపులా సానుకూల పరిస్థితులు ఉంటేనే కదా జరిగేది..? అని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో మరలా కలిసి, మెలిసి పని చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, శాశ్వత మిత్రత్వం ఏమీ ఉండదు.. బీహార్ లో నితీష్ కుమార్ ఉదంతం మనకు తెలిసిందే కదా..? అని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంది.. రాష్ట్రాలకు పలు ప్రయోజనాలు చేకూర్చుకుంటున్నాయని.. అందుకు ఒడిశా, తమిళనాడులే ఉదాహరణగా తెలిపారు. దేశంలో రానున్న రోజుల్లో అదే జరుగుతుందని నా భావనగా వెల్లడించారు బీజేపీ నేత సుజనా చౌదరి.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!