NTV Telugu Site icon

Somu Veerraju: మాచర్ల ఘటనలపై జిల్లా ఎస్పీ మాట్లాడిన తీరు ఆక్షేపణీయం

Somu Veerraju

Somu Veerraju

Somu Veerraju: శుక్రవారం జరిగిన మాచర్ల సంఘటనలపై జిల్లా ఎస్పీ మాట్లాడిన తీరు ఆక్షేపణీయంగా ఉందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. పాత ఫ్యాక్షన్ గొడవల వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ పేర్కొనడం పోలీసుల పలాయన వాదమని ఆరోపించారు. ఫ్యాక్షన్, పాత కక్షల వల్ల గొడవలు జరిగితే రాజకీయ పార్టీలు ఇందులో ఎందుకు పాల్గొన్నాయని ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం విఫలమైందని మండిపడ్డారు.

Harish Rao : వీటికి జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలి.. కేంద్రంను కోరిన హరీష్‌రావు

ఇప్పటికైనా డీజీపీ ఈ ఘటనపై స్వయంగా వివరాలు సేకరించి ఆ ప్రాంతాన్ని సందర్శించాలని సూచించారు. ఈ గొడవలకు కారకులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. నాడు, నేడు ఉన్న వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు తమ ఉనికి కోసం అల్లర్లను ప్రోత్సహించాయన్నారు.