ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తన కొడుకే ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధిస్తారని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చి తన మనసు మార్చే ప్రయత్నం చేసినా ఫలితం ఉండదన్నారు. స్వతంత్రంగా పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా గత కొద్ది రోజుల క్రితం బీజేపీ మొత్తం 20 మంది అభ్యర్ధుల జాబితాను రిలీజ్ చేయగా.. అంతకంటే ముందే హవేరి- గడగ్ లోక్‌సభ సీటును తన కుమారుడు కే.ఈ.కాంతేష్ కు సీటు కావాలని బీజేపీ అదిష్టానంతో కేఎస్ ఈశ్వరప్ప చర్చలు జరిపారు.
Read Also: Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు జైలుకు వెళ్లింది వీళ్లే..?
కానీ, కాంతేష్‌కు హవేరి లోక్‌సభ సీటు వస్తుందంటూ మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సైతం హామీ ఇవ్వగా.. కాంతేష్ గెలుపు కోసం ప్రచారం చేస్తానని కూడా యడ్యూరప్ప హామీ ఇచ్చినట్లు ఈశ్వరప్ప వెల్లడించారు. అయితే, అనూహ్యంగా హవేరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని బీజేపీ అధిష్టానం పోటీలో దించుతుంది. దీంతో అధిష్టానం నిర్ణయంపై కేఎస్. ఈశ్వరప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Baby Girl Born: అమానుషం.. మూడోసారీ కూడా ఆడబిడ్డే పుట్టడంతో.. పాపని పొలాల్లో విసిరేసిన తల్లి..!
ఈ తరుణంలో శివ మొగ్గలో జరిగిన బహిరంగ సభలో ఈశ్వరప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరప్ప మద్దతుదారులు స్వంతంత్ర్య అభ్యర్ధిగా బరిలో దిగడంపై మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఒప్పిస్తే పోటీ నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు.. దీనికి ఈశ్వరప్ప రియాక్ట్ అయ్యారు. ‘మోడీ నిర్ణయం ఎలా ఉన్నా వెనక్కి తగ్గేది లేదు.. నా మద్దతుదారులను, కార్యకర్తలను నేను ఎప్పుడు అగౌరవపరచనన్నారు. విజయవంతంగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తానన్న నమ్మకం నాకు ఉందన్నారు. ఇక, అంతకు ముందు ఓ సందర్భంలో.. ‘నేను 40 ఏళ్లుగా పార్టీకి నమ్మకంగా పని చేశా.. సీటీ రవి, సదానంద గౌడ, నళిన్‌కుమార్ కటీల్, ప్రతాప్ సింహాలు మద్దతుగా నిలిచారు. కానీ, లోక్‌సభ సీట్ల కేటాయింపులో తనకు అన్యాయమే జరిగిందని కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం కేఈ ఈశ్వరప్ప ఆవేదన వ్యక్తం చేశారు.