Guduru Narayana Reddy : బండి సంజయ్‌కు కేంద్ర భద్రత కల్పించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్ర భద్రత కల్పించాలని బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి కేంద్రాన్ని కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌కు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసులపై తమకు నమ్మకం పోయిందని, బండి సంజయ్‌కు ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బందితో రక్షణ కల్పించాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి బుల్లెట్ ప్రూఫ్ కారును కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు మొదటి నుంచి సమస్యలు సృష్టిస్తున్న టీఆర్‌ఎస్, జనగాం జిల్లాలోకి ప్రవేశించిన బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారన్నారు. అమిత్ షా పాదయాత్ర, బహిరంగ సభ విజయవంతమవడాన్ని జనగాం జిల్లా నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని, సంజయ్ కుమార్ పాదయాత్రకు భంగం కలిగించాలని కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. ఇటీవల బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు దాడికి యత్నించారని మండిపడ్డారు.
Also Read
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
- Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
బీజేపీ నేతలను టీఆర్‌ఎస్ నేతలు బెదిరించారని, పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగుతున్నా టీఆర్‌ఎస్ నేతలు బీజేపీ నేతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పాదయాత్ర ఆపాలని వర్ధన్నపేట ఏసీపీ రమేష్ బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చారని, సంజయ్‌ను అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించడాన్ని తప్పుబట్టి పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని, టీఆర్‌ఎస్ రాష్ట్రంలో మతతత్వ మంటలను రాజేస్తూ…తిరిగి బీజేపీని నిందిస్తోందన్నారు. మంచి పంటలు కావాలా మత మంటలు కావాలా ఎంచుకోవాలని సీఎం వ్యాఖ్యలు చేశారని, బీజేపీని మతవాద గ్రూపుగా చిత్రీకరించేందుకు సీఎం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారన్నారు. గడిచిన ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌లో మత ఘర్షణలు లేవని, టీఆర్‌ఎస్, ఎంఐఎంల కుట్రలతో నగరంలో ఏ సమయంలోనైనా మతకల్లోలాలు చోటుచేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
-
POCO X8, X8 Power: పోకో ఎక్స్8 పవర్, పోకో ఎక్స్8 భారత్‌లో లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, ధరలు ఇవే!
-
Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
-
CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్తాన్ మహిళల టీ20 మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలి?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!