Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharman: సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే స్క్రీన్‌పై ఒక ప్రత్యేకమైన స్వాగ్ కనిపించాలి. కానీ ఈసారి ఆ స్వాగ్‌కు డాక్టర్ లుక్ కూడా తోడవుతోంది. రజనీకాంత్‌ను ఇప్పటివరకు ఎన్నో విభిన్న పాత్రల్లో చూసిన అభిమానులకు ‘ధర్మన్’లో ఆయన కొత్త లుక్ ఆసక్తిని కలిగిస్తోంది. ‘డ్రాగన్’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మరిముత్తు ఈ మూవీని తెరకెక్కిస్తుండటంతో సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అంచనాలకు మరింత ఊపు ఇచ్చేలా ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ కూడా పూర్తయింది.
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘ధర్మన్’ మూవీకి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘తలైవర్ 173’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు ‘ధర్మన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, ఆర్. మహేంద్రన్‌కు చెందిన టర్మరిక్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ జూన్ 25న ప్రారంభమైంది. తాజాగా సెప్టెంబర్ 4న రెండో షెడ్యూల్ పూర్తయినట్లు మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు.
Also Read
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
- Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
రెండో షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ‘ధర్మన్ 2nd Schedule Wrapped. Swag Mode: ON’ అంటూ ఇచ్చిన అప్డేట్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో రజనీకాంత్ మరోసారి తనదైన స్టైల్‌తో కనిపించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో డాక్టర్ అవతారంలో కనిపించిన రజనీకాంత్, ఈసారి కూడా అదే పాత్రకు సంబంధించిన కొత్త షేడ్స్‌ను చూపించారు. ‘ధర్మన్’లో రజనీకాంత్ పాత్రను ‘ది డెడ్లీ డాక్టర్’గా పరిచయం చేస్తూ మేకర్స్ గతంలోనే సెకండ్ షెడ్యూల్ ను ప్రకటించారు. డాక్టర్ పాత్రకు యాక్షన్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ అశ్వత్ మరిముత్తు ఒక కొత్త తరహా కమర్షియల్ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక రెండో షెడ్యూల్‌ను దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఊహించిన దానికంటే వేగంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల షూటింగ్ కోసం ప్లాన్ చేసిన షెడ్యూల్‌ను కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేసినట్లు సమాచారం. పైగా ఔట్ పుట్ కూడా ఏమాత్రం తగ్గకుండా రావడంతో రజనీకాంత్ దర్శకుడిని అభినందించారంట. ఈ వేగంతో దర్శకుడు పని చేస్తే అనుకున్న సమయానికే సినిమా కూడా రిలీజ్ అవుతుందని సినీ వర్గాలలో చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు సిమ్రాన్, రాశి ఖన్నా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రుక్మిణి వసంత్, రామ్ పోతినేని కూడా ఈ సినిమాలో భాగమవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ పోతినేని విలన్ పాత్రలో కనిపించవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.
మరోవైపు రజనీకాంత్ చేతిలో ‘ధర్మన్’తో పాటు ‘జైలర్ 2’ కూడా ఉంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో మరోసారి కనిపించనున్నారు. ‘జైలర్ 2’ అక్టోబర్ 15న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అలాగే కమల్ హాసన్‌తో రజనీకాంత్ మరోసారి కలిసి నటించనున్న ప్రాజెక్ట్ కూడా ఉంది. మొత్తానికి ‘ధర్మన్’ షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు సూపర్‌స్టార్ స్వాగ్, మరోవైపు ‘డ్రాగన్’తో తనదైన ముద్ర వేసిన దర్శకుడి కొత్త తరహా కథనం కలిస్తే ‘ధర్మన్’ రజనీకాంత్ కెరీర్లో మరో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా నిలిచే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?