BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Reservations: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిల్‌ను కొట్టివేయాలని కోర్టును ప్రభుత్వం కోరింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని దాటుతాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి బీఏవీపీ కుమారరెడ్డి కౌంటర్ దాఖలు చేశారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు క్షేత్రస్థాయి వాస్తవాలు, సమకాలీన గణాంకాల ఆధారంగానే నిర్ణయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి, సరిచూసి, నవీకరించినట్లు తెలిపింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభాలో బీసీలు 50.42 శాతం ఉన్నారని ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. స్థానిక పాలనలో బీసీలకు అర్థవంతమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది. అందుకు తగిన స్థాయిలో రిజర్వేషన్లు ఉండాల్సిందేనని, అందుకే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు కౌంటర్లో వివరించింది.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారుకు మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. బీసీల సామాజిక, విద్యా, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, జనాభా, స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిధ్యంపై కమిషన్ ఆధారాలను పరిశీలించిందని పేర్కొంది. 2020లో రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో ప్రస్తుత కుటుంబ సర్వే వంటి సమకాలీన సమాచారం అందుబాటులో లేదని ప్రభుత్వం తన కౌంటర్లో పేర్కొంది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రక్రియ సమకాలీన ఆధారాలను పరిశీలించాలన్న న్యాయస్థానాల మార్గదర్శకాలకు అనుగుణంగానే కొనసాగుతోందని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!