Godavari Anjireddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్‌లో పసుపు బోర్డుని ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకు తెలంగాణ రైతులతో పాటు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
Also Read: APCOB Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆప్కాబ్‌లో ఉద్యోగాలు..
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు ప్రజల కోసం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామచంద్రాపురం డివిజన్ ప్రధాన కార్యదర్శి బలరాం, రాములు యాదవ్, కనకరాజు, భూపాల్ రెడ్డి, యాదిరెడ్డి, జైపాల్ రెడ్డి , పెంటా రెడ్డి, భారతి నగర్ డివిజన్ ఉపాధ్యక్షురాలు గీత, ఎస్టీ మోర్చా అధ్యక్షులు రవీంద్ర నాయక్, ఎల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.