Ramchander Rao: బండి సంజయ్‌పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు

Ramchanderrao

Ramchanderrao

Ramchander Rao: గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల భగీరథ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓ పక్క నిందితుడిపై చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ ప్రశ్నకు తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు సమాధానమిచ్చారు. “బండి సంజయ్‌ తప్పు చేస్తే పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఆయన తప్పు చేయలేదు. సంజయ్‌ కుటుంబసభ్యులు తప్పు చేస్తే న్యాయపరంగా చూసుకుంటారు. ముందస్తు బెయిల్‌ తీసుకోవడం అనేది హక్కు. పారిపోలేదు. బెయిల్‌ పెండింగ్‌లో ఉంది. భగీరథ్‌‌ సరెండర్‌ అయ్యాడు. బీఆర్ఎస్‌కు ఇంకో పని లేనట్టు ఉంది. కోట్లు ఖర్చు చేసి బండి సంజయ్‌, ఆయన కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.” అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. పోక్సో కేసులో నిందితుడు భగీరథ్ నేరం అంగీకరించాడని సైబరాబాద్ కమిషనర్ తెలిపారు. లుక్ అవుట్ నోటీసులు, గాలింపు అనంతరం పోలీసులు భగీరథ్ ను అదుపులోకి తీసుకున్నారు. న్యాయవాదుల సమక్షంలో లొంగిపోయాడని బండి సంజయ్ ప్రకటించగా, పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు నేరం అంగీకరించాక అరెస్ట్, 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. భగీరథ్‌ స్నేహితులను పోలీసులు విచారించారు. సిట్ భగీరథ్‌ స్నేహితుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. ఘటన రోజు ఏం జరిగిందో స్నేహితులు నుంచి వివరాలు తెలుసుకున్నారు. భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని సిట్ భావిస్తోంది. ఈ మేరకు మేడ్చెల్‌ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనుంది. అరెస్టు రోజు భగీరథ్‌ను పూర్తి స్థాయిలో విచారించడానికి సమయం దొరకలేదని సిట్ వాదిస్తోంది. కస్టడీలోకి తీసుకొని ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారించాలని సిట్ భావిస్తోంది.